S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/24/2020 - 04:14

హైదరాబాద్, ఫిబ్రవరి 23: రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకోమని, ఉద్యమాన్ని చేపడుతామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఇక్కడ రిజర్వేషన్ల పరిరక్షణపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రాజకీయ , ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లను విస్తరించాలన్నారు. ఇందుకు తగిన కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

02/24/2020 - 01:22

హైదరాబాద్, ఫిబ్రవరి 23: పట్టణాల రూపు రేఖలు మార్చే లక్ష్యంగా రూపొందించిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభం కానుంది. వచ్చే 4 వరకు పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మహబూబ్‌నగర్‌లో ప్రారంభించనున్నారు.

02/24/2020 - 01:19

హైదరాబాద్, ఫిబ్రవరి 23: కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు అదనపు నిధుల కోసం ఎప్పటికప్పుడు యూసీలు (యుటిలైజేషన్ సర్ట్ఫికేట్లు) ఇవ్వాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను సరిగ్గా ఖర్చు చేయాలని సూచించారు. గిరిజన

02/23/2020 - 05:22

హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రత పరిరక్షణలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.

02/23/2020 - 05:21

హైదరాబాద్, ఫిబ్రవరి 22: హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని, అత ఆరు సంవత్సరాలలో నక్సలిజం, టెర్రరిజం కదలికలు లేవని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

02/23/2020 - 05:19

హైదరాబాద్, ఫిబ్రవరి 22: వ్యాధి నిరోధక టీకాలను వేయడం ద్వారా రోగ నిరోధక రేటును పెంచడంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. 2019-20 సంవత్సరంలో తెలంగాణ 92.4 శాతంతో ముందంజలో ఉంది. 2017లో తెలంగాణ రేటు 72 శాతంగా నమోదైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తీసుకున్న మెరుగైన చర్యల వల్ల వ్యాధి నిరోధక టీకాల్లో తెలంగాణ అగ్రస్థానం పొందింది.

02/23/2020 - 05:18

హైదరాబాద్, ఫిబ్రవరి 22: పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యానికీ, ప్రభుత్వ నిర్లక్ష్యానికీ నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చింది. శనివారం నాడు టీపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ టీయూ అధ్యక్షుడు జాడి రాజన్న అధ్యక్షత వహించారు.

02/23/2020 - 01:31

పాపన్నపేట, ఫిబ్రవరి 22: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావానిమాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్న మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శనివారం భక్తజనం వెల్లువెత్తింది. చెట్లు, రాళ్లగుట్టలతో ఉండే అటవీ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జానపదుల జాతర జనరంజకంగా సాగింది. డప్పువాయిద్యాల మోతలు, బోనాల ఊరేగింపులు, శివసత్తుల శిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల జాతర ప్రాంగణమంతా హోరెత్తింది.

02/23/2020 - 02:32

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాన్ని యాచక రహిత నగరం (బెగ్గర్ ఫ్రీ సిటీ)గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. యాచకులకు ప్రత్యామ్నాయ పునరావాసంపై కేంద్ర అధికారుల బృందం శనివారం నగరంలో పలు ప్రభుత్వ శాఖలతో సమావేశమైంది.

02/23/2020 - 01:25

హైదరాబాద్, ఫిబ్రవరి 22: హైదరాబాద్ నగర పౌరులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పురపాలన అందించేందుకు జీహెచ్‌ఎంసీ చట్టాన్ని మార్చనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో అమలులోకి తీసుకువచ్చిన నూతన పురపాలక చట్టంలోని అన్ని కీలకమైన అంశాలను జీహెచ్‌ఎంసీ కొత్త చట్టంలో పొందుపరచనున్నట్లు ఆయన చెప్పారు.

Pages