S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/09/2019 - 23:32

బొమ్మలరామారం, మే 9: గ్రామాల సమగ్రాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.

05/09/2019 - 23:30

అమరచింత, మే 9: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజల తాగునీటీ అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చోరవ తీసుకుని కర్ణటక ముఖ్యమంత్రి తో చర్చించి 2-50 టీఎంసిల నీటీని నారాయణపూర్ డ్యాం నుంచి విడుదుల చేసేందుకు ఒప్పించడంతో గురువారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 500 క్యూసెక్కుల కర్ణాటక నీరు చేరిందని జూరాల హెచ్‌డి శ్రీదర్ తెలిపారు.

05/09/2019 - 23:28

యాదగిరిగుట్ట, మే 9: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు విక్రయిస్తున్న ప్రస్తుత ప్రసాద లడ్డూతో పాటు బెల్లంతో తయారుచేసే ప్రసాద లడ్డూను అదనంగా విక్రయించేందుకు ఆలయ యంత్రాంగం అవసరమైన కసరత్తు చేపట్టింది.

05/09/2019 - 23:26

నాగార్జునసాగర్, మే 9: తెలంగాణ రాష్ట్రంలో ఇక ఎటువంటి విద్యుత్ కోతలు ఉండవని తెలంగాణ రాష్ట్ర జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. గురువారం నాగార్జునసాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. తొలుత స్ధానిక జెన్‌కో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

05/09/2019 - 23:21

కరీంనగర్ టౌన్, మే 9: కరీంనగర్ నగరంలో అంతర్గత మురికి కాలువల పైప్‌లైన్ కనెక్షన్లు వెంటనే పూర్తి చేయాలని మేయర్ రవీందర్‌సింగ్ ఆదేశించారు. స్మార్ట్‌సిటీగా నగరం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో, గత కొన్నాళ్ళుగా మందకొడిగా కొనసాగుతున్న యూజీడీ పనులపై ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

05/09/2019 - 23:20

సంగెం, మే 9: కారు, ఆటో, రిక్షా ఇలాంటి వాహనాల్లో మనం పెళ్లి ఊరేగింపు చూసి ఉంటాం.. కాని జేసీబీ వాహనంలో నూతన వధూవరులను ఊరేగించిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రాంచంద్రాపురం గ్రామంలో జరిగింది. ఉడుత రాకేష్, సుప్రజకు బుధవారం లోహిత గ్రామంలో వివాహం జరిగింది. వరుడు రాకేష్ డీగ్రీ వరకు చదువుకున్నారు. ఆయనకు వాహనాల డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అన్ని రకాల వాహనాలను నడిపాడు.

05/09/2019 - 13:17

రంగారెడ్డి:మైలార్‌దేవుపల్లిలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో గురువారంనాడు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటలు ఎగిసిపడటంతో ఆ పొగకు స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

05/09/2019 - 13:16

హైదరాబాద్: బంగారం చోరీ కేసు దర్యాప్తు కోసం ఒడిశా వెళ్లిన హైదరాబాద్ పోలీసులపై దాడి జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లా డెంగాడికి విచారణ కోసం వెళ్లిన పోలీసులపై స్థానిక గ్రామస్తులు దాడి చేశారు. ఒడిశా పోలీసులు జోక్యం చేసుకుని హైదరాబాద్ పోలీసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామస్తుల దాడిలో హైదరాబాద్ పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసు వాహనం ధ్వంసం అయింది.

05/09/2019 - 04:37

గోదావరిఖని, మే 8: రెండు దశాబ్దాలకు పైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని డివిజన్ కేంద్రంగా నాలుగు రాష్ట్రాల్లో సాగుతున్న కలప దందాకు ఎట్టకేలకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లోని అడవులను నరికివేస్తూ కలప దందా ను దర్జాగా కొనసాగిస్తున్న ముఠాను ఇటీవలే రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి లోతుగా విచారణను చేపట్టారు.

05/09/2019 - 04:35

హైదరాబాద్, మే 8: ఓ వైపు నష్టాల భారం ఆర్టీసీని వెంటాడుతుంటే మరోవైపు కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలన్న ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం తక్షణ కర్తవ్యం కోసం మల్లాగుల్లాలు పడుతోంది. ఆర్టీసీని లాభాలవైపు తీసుకురావడానికి అధికారులు సమీక్ష, సమావేశాలు కొనసాగుతున్నా బయటపడే మార్గాలు కనుచూపులో కన్పించడం లేదని కార్మిక యూనియన్లు బహిరంగంగా విమర్శిస్తున్నాయి.

Pages