S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/09/2019 - 04:29

హైదరాబాద్, మే 8: రాష్ట్రంలో ఇంటర్ బోర్డు వైఫల్యంతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ విహారయాత్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కన్‌కల్ గ్రామంలో మరణించిన దళిత విద్యార్థి జ్యోతి కుటుంబ సభ్యులను ఆయన బుధవారం పరామర్శించారు.

05/09/2019 - 04:29

హైదరాబాద్, మే 8: పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత విద్యార్థులు గందరగోళానికి గురి కాకుండా పిల్లలకు శిక్షణ అందించడంతో పాటు తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించడం ద్వారా వారికి చక్కని మార్గదర్శకం అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది రాష్ట్రంలో 11,023 పాఠశాలల నుండి విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు.

05/09/2019 - 04:28

హైదరాబాద్, మే 8: పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి పదవి పట్ల ఆశలేని వారిని నియమించాలని , ఈ విషయమై ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖ రాయనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడడం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వైఫల్యం కాదని, సొంత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయిస్తున్నారన్నారు.

05/09/2019 - 04:26

హైదరాబాద్, మే 8: తెలంగాణలో మధ్యాహ్న భోజన వ్యయం ప్రభుత్వంపై మరింత భారం కానుంది. ఇటీవలె కేంద్రం వంట వ్యయాన్ని పెంచిన నేపథ్యంలో రాష్ట్ర వాటా కింద దాదాపు ఏటా మరో 15 కోట్ల అదనపు భారం పడనుంది. తెలంగాణలో 28,621 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నారు.

05/09/2019 - 03:53

హైదరాబాద్, మే 8: హైదరాబాద్‌లోని (ఎర్రగడ్డ) టీబీ లేదా ఛాతీ వ్యాధుల (చెస్ట్ హాస్పిటల్) దవాఖానా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. టీబీ చికిత్సకోసం ఈ దవాఖానా రాష్ట్రం మొత్తంలో అత్యుత్తమమైందిగా పేరు తెచ్చుకుంది. 65 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దవాఖానాపట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనిపిస్తోంది. మొదట 670 బెడ్లతో ఏర్పాటైన ఛాతీవ్యాధుల దవాఖానాలో నేడు బెడ్ల సంఖ్య 400 కు తగ్గిపోయింది.

05/09/2019 - 03:42

హైదరాబాద్, మే 8: మంచిర్యాల జిల్లాలో తొలిదశలో పోలైన ఓట్ల శాతం 76.34 శాతమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ జిల్లాలో 66.86 శాతం ఓట్లు మాత్రమే పోలైనట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించిందని ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు.

05/08/2019 - 22:55

సూర్యాపేట, మే 8: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం లాంటిదని, పాలకులు, ప్రగతిని నిర్దేశించేది ఓటుహక్కుతోనేనని, అదే ఓటుతో రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే వినూత్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశానికే స్ఫూర్తిగా నిలిపామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

05/08/2019 - 22:53

ఊట్కూర్, మే 8: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వానిదేనని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖను 70 రోజులలో తన ఇష్టానుసారంగా గ్లోబరీనా సంస్థకు కట్టబెట్టి అస్తవ్యస్తంగా ఫలితాలు ప్రకటించారని బీజేపీ శాసనసభ మాజీ విపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవక లు, విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్టప్రతి రాజ్‌నాథ్‌కోవింద్‌కు పూర్తి నివేదికను అం దిస్తామన్నారు.

05/08/2019 - 22:50

కరీంనగర్, మే 8: కన్నతల్లి చచ్చిపోయినా కడసారి చూపుకు పంపించలే.. భార్య అచేతనావస్థలో ఆసుపత్రిపాలైందన్నా పట్టించుకోలే, బతుకుదెరువు కోసం అబుదాబీ వచ్చి రెండేళ్లవుతుంది. నరకం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంతకంటే నరకం మరెవరూ అనుభవించరేమో? స్వదేశానికి వచ్చేట్టు చూడండి సార్ అంటూ సోషల్ మీడియాలో తెలు‘గోడు’కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..

05/08/2019 - 22:43

నార్నూర్/ ఉట్నూరు, మే 8: ఏజెన్సీలోని ఓ గిరిజన కుటుంబంలో పెళ్ళి వేడుకలో విషాదం అలుముకుంది. విందు భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడగా మరో 24 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Pages