S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/08/2019 - 04:22

హైదరాబాద్, మే 7: ఫోని తుఫాన్ వల్ల దెబ్బతిన్న ఒడిస్సా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం తెలంగాణ నుంచి 1000 మంది విద్యుత్ ఉద్యోగులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఒడిస్సా ప్రభుత్వానికి సహాయం అందించాల్సిందిగా అక్కడి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.

05/08/2019 - 04:21

హైదరాబాద్, మే 7: రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల మంచి ఫలితాలువస్తున్నాయి. రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలు వందకు వంద శాఖ ఆస్తి పన్నును వసూలు చేసి రికార్డు సృష్టించాయి. మరో 25 మున్సిపాలిటీలు 98 శాతం ఆస్తిపన్నును వసూలు చేశాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.453 కోట్ల ఆస్తిపన్నును మున్సిపాలిటీలు వసూలు చేశాయి.

05/08/2019 - 04:20

హైదరాబాద్, మే 7: హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని, శాంతిని భగ్నం చేసే శక్తులపై ఉక్కుపాదం మోపాలని కోరుతూ బీజేపీ నేతలు రాష్ట్ర హోంశాఖ మంత్రినికలిసి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

05/08/2019 - 04:19

హైదరాబాద్, మే 7: ఆన్‌లైన్ విత్తన ధృవీకరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్రప్రభుత్వ వ్యవసాయ శాఖ విత్తన విభాగం సహాయ కమిషనర్ డాక్టర్ డి.కే. శ్రీవాస్తవ శ్లాఘించారు. హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్‌లైన్‌లో విత్తన ధృవీకరణ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం ఇచ్చిన నిధులను తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వినియోగించుకుందన్నారు.

05/08/2019 - 04:19

హైదరాబాద్, మే 7: గీతం యూనివర్శిటీ హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగలూరు ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ స్లైడింగ్ విధానంలో కౌనె్సలింగ్‌ను ఈ నెల 9 వ తేదీ నుండి 11 వరకూ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కే నరేంద్ర తెలిపారు.

05/08/2019 - 04:05

జిన్నారం(గుమ్మడిదల), మే 7: ఢిల్లీలో జరిగే జాతీయ మానవ హక్కుల సంఘం ఇంటర్న్‌షిప్‌కు గుమ్మడిదల మండలం బొంతపల్లి వాసి ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామంలోని వీరభద్రనగర్‌కు చెందిన ఎం.శ్రీకాంత్‌గుప్త హైదరాబాద్‌లోని పెండెకంటి లా కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

05/07/2019 - 04:49

ఖమ్మం, మే 6: మొదటి దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. ఖమ్మం జిల్లాలో 85.74, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 77.33శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే ఖమ్మం జిల్లాలో భారీగా పోలింగ్ నమోదు కావటం విశేషం.

05/07/2019 - 04:49

హైదరాబాద్, మే 6: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఉమ్మడి ప్రవేశాలకు దోస్త్ ఆన్‌లైన్ విధానాన్ని పాటిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి జనార్థన్‌రెడ్డి చెప్పారు. సోమవారం నాడు దోస్త్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన దోస్త్ షెడ్యూలను విడుదల చేశారు.

05/07/2019 - 04:48

హైదరాబాద్, మే 6: పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు తరమి కొట్టాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం రావడం వల్లనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై జనం తిరగబడుతున్నారని అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం వి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌పై ప్రజలు చెప్పులతో దాడి చేశారన్నారు.

05/07/2019 - 04:48

హైదరాబాద్, మే 6: ఆత్మహత్యలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన చాలా అభ్యంతరకరంగా ఉందని, ఆయన వెంటనే తన పదవి నుండి తప్పుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.

Pages