S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/08/2019 - 22:42

నిజామాబాద్, మే 8: దారిద్య్ర రేఖకు దిగువన జీవనం వెళ్లదీస్తున్న కుటుంబాలకు చేరాల్సిన సబ్సిడీ బియ్యం తన రూపాన్ని మార్చుకుని నల్లబజారుకు చేరుకుంటోంది. అధికారుల నిఘా వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుని పలువురు ముఠాగా ఏర్పడి నెలనెలా రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నారు.

05/08/2019 - 22:41

కట్టంగూర్, మే 8: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని స్థానికసంస్థలు నిర్వీర్యమయ్యాయని, నిధులు లేక అలంకారప్రాయంగా మారిపోయాయని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ విమర్శించారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని చెర్వు అన్నారం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

05/08/2019 - 04:28

హైదరాబాద్, మే 7: ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం లేకనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో దీక్షలు చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలతో నిమ్మరసం తాగించి దీక్షలను విరమింపచేసిన చుక్కా రామయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మహత్యలు పరిష్కారం కాదని పేర్కొన్నారు.

05/08/2019 - 04:26

హైదరాబాద్, మే 7: నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించే విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి హెచ్చరించారు. విత్తన టాస్క్ఫోర్స్ బృందాలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఇక్కడ సదస్సు నిర్వహించారు. నకిలీ విత్తనాను ఏ విధంగా గుర్తించాలో, అలా గుర్తించిన తర్వాత సంబంధిత బాధ్యులపై ఎలాంటి చర్చలు తీసుకోవాలో వివరించారు.

05/08/2019 - 04:25

హైదరాబాద్, మే 7: గ్రామాలకు కొత్త సర్పంచ్‌లు ఎన్నికై నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. గ్రామాల్లో ప్రజలు మంచినీటితో కటకటలాడుతున్నారని, వౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

05/08/2019 - 04:25

హైదరాబాద్, మే 7: బ్యాలెట్ పేపర్లు తారుమారు కావడం, పొరపాట్లు జరగడంతో రాష్ట్రంలోని రెండు ఎంపీటీసీ నియోజకవర్గాలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 14 న రీ-పోలింగ్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు.

05/08/2019 - 04:24

హైదరాబాద్, మే 7: కల్తీనారు విక్రయించే నర్సరీలపై ఇకనుండి ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర ఉద్యాన డైరెక్టర్ ఎల్. వెంకటరామ్‌రెడ్డి హెచ్చరించారు. కల్తీనారుమొక్కల ఉత్పత్తి, అమ్మకాలను అరికట్టేందుకు రెండేళ్ల క్రితమే జీఓ జారీ అయిందని గుర్తు చేశారు.

05/08/2019 - 04:24

హైదరాబాద్, మే 7: ఇంటర్ బోర్డు అవకతవకల వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతకు నిరసనగా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల ఫెయిలై ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు.

05/08/2019 - 04:23

హైదరాబాద్, మే 7: తెలంగాణలో స్థానిక సంస్థల నుండి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 31 న ఉప-ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

05/08/2019 - 04:22

హైదరాబాద్, మే 7: రాష్ట్రంలోని ఇంటర్ విద్యలో సమూల మార్పులు చేయాల్సిందేనని టీ మాస్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఇందుకోసం సామాజిక సంస్థలు, ప్రజా సంస్థలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన సూచించారు. మంగళవారం నాడు కంచె ఐలయ్య, స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఆర్ శ్రీరాం నాయక్‌లతో కలిసి దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘం నేతలను కలిసి సంఘీభావం ప్రకటించారు.

Pages