S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/07/2019 - 04:47

హైదరాబాద్, మే 6: పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ముస్లింలు నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరిస్తారని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిందన్నారు.

05/07/2019 - 04:47

హైదరాబాద్, మే 6 : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసాక పోలింగ్ శాతం పెరగడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశీధర్‌రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ పాత్రపైనే తమకు అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు.

05/07/2019 - 04:46

హైదరాబాద్, మే 6: తెలంగాణలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర ప్రథమ ఆర్థిక కమిషన్ చైర్మన్ జి. రాజేశంగౌడ్ తెలిపారు. హైదరాబాద్ (ఎర్రమంజిల్) లోని ఆర్థిక కమిషన్ కార్యాలయంలో కమిషన్ మెంబర్ సెక్రటరీ సురేష్ చందాతో సోమవారం ఆయన చర్చలు జరిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సొంత వనరుల ద్వారా ఆదాయం సమకూర్చుకునే మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు.

05/07/2019 - 03:43

మునగాల, మే 6: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని బరాఖత్‌గూడెం గ్రామంలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో ఓ ఓటరును పోలీసులు టీ షర్టు విప్పించి ఓటు వేయించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శీలం శ్రీను ఎర్ర రంగు టీ షర్టును ధరించి ఓటు వేసేందుకు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలో నిలబడ్డాడు.

05/07/2019 - 03:41

ములుగుటౌన్, మే 6: ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో గల కోస్టల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దేవాదుల ఎత్తిపోతల పథకం పైప్‌లైన్, టనె్నల్ నిర్మాణ పనులు చేపడుతున్న సబ్ కాంట్రాక్టర్ అయిన కోస్టల్ కంపెనీ పంట పొలాల్లో ఆఫీసును ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ పనులు, గ్యారేజీ నిర్వహిస్తోంది.

05/07/2019 - 03:39

నార్కట్‌పల్లి, మే 6: ప్రజలకు నిరంతరం సేవలు చేస్తూ అందుబాటులో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ను నార్కట్‌పల్లి మండల ప్రజలు ఎన్నటికీ మరచిపోలేదని టీఆర్‌ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా జడ్పీటీసీగా కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి గెలుపొందడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

05/07/2019 - 03:38

సూర్యాపేట, ఆత్మకూరు (ఎం), గొల్లపల్లి, మే 6: వడదెబ్బ తాకిడికి తాళలేక తెలంగాణలో ఆరుగురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురు, జగిత్యాల జిల్లాలో ఒకరు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో వివిధ గ్రామాలకు చెందిన ముగ్గురు సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందారు.

05/07/2019 - 03:37

మిర్యాలగూడ టౌన్, మే 6: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన సరైంది కాదని ప్రధాని మోదీ బీహార్ పర్యటనలో పేర్కొనడం ఆయన అవగాహన, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు.

05/07/2019 - 03:35

నిజామాబాద్, మే 6: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించనున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ధీమా వెలిబుచ్చారు. తెలంగాణాలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

,
05/07/2019 - 03:33

సంస్థాన్‌నారాయణపురం, మే 6: యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని కంకణాలగూడెం ఎంపీటీసీకి బదులు జనగాం ఎంపీటీసీకి చెందిన బ్యాలెట్లతో అధికారులు ఓట్లు వేయిస్తుండటంతో గమనించిన ఓటర్లు, అభ్యర్థులు పోలింగ్‌ను అడ్డుకున్న సంఘటన సోమవారం కంకణాలగూడెం, కొత్తగూడెం గ్రామాలలో జరిగింది. తీవ్రమైన గందరగోళం మధ్య ఉదయం 9గంటలకు పోలింగ్ నిల్పివేశారు.

Pages