S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/10/2019 - 23:37

ఖమ్మం, మే 10: ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండోదశ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 82.92, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 76.70 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలోని 6, కొత్తగూడెం జిల్లాలోని 8మండలాల పరిధిలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు శుక్రవారం ఉదయం నుంచే ఓటుహక్కును వినియోగించుకునేందుకు జనం బారులు తీరారు.

05/10/2019 - 23:26

హైదరాబాద్, మే 10: యూనివర్శిటీ సామాజిక బాధ్యత కింద ఇంగ్లీషు- విదేశీ భాషల విశ్వవిద్యాలయం ఖైరతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంచుకుని అక్కడ విద్యార్థులకు, బోధన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టిన తొలి విశ్వవిద్యాలయంగా ఇఫ్లూ ముందుకు రావడం అభినందనీయమని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు.

05/10/2019 - 23:25

హైదరాబాద్, మే 10: టీవీ 9 సంస్థలో సీఈఓగా ఉన్న రవిప్రకాశ్‌కు ఆ సంస్థ శుక్రవారం ఉద్వాసన పలికినట్టు ప్రకటించింది. నిధుల మళ్ళింపుతో పాటు సంస్థకు చెందిన ముఖ్యమైన పత్రాల ఫోర్జరీకి రవిప్రకాశ్ పాల్పడినట్టు ఆయనపై టీవీ-9 కొత్త యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

05/10/2019 - 23:24

హైదరాబాద్, మే 10: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దూకుడును పెంచుతామని అంద రినీ కలుపుకుని బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ప్రకటించారు. బీజేపీ గత తప్పిదాల నుంచి అనేక పాఠాలను నేర్చుకుందని, టీడీపీ పొత్తు వల్ల చాలా నష్టపోయామని ఆయన చెప్పారు.

05/10/2019 - 23:23

హైదరాబాద్, మే 10: విద్యార్థుల ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలేనని, సీఎం కేసీఆర్‌కు ఇతర రాష్ట్రాల పర్యటనపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆత్మహత్యలపై లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం సరిదిద్దాలని కోరుతూ ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఎఐవైఎఫ్ దీక్షలు చేస్తున్న నేతలను శుక్రవారం నాడు ఆయన సంఘీభావం ప్రకటించారు.

05/10/2019 - 23:23

హైదరాబాద్, మే 10: పదో తరగతి ఫలితాలను ఈ నెల 13వ తేదీ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డి విడుదల చేయనున్నారని, విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్, పరీక్షల బోర్డు సంచాలకుడు సుధాకర్‌లు తెలిపారు. ఫలితాలను పరీక్షల బోర్డు వెబ్ పోర్టల్ సహా ఇతర పోర్టల్స్‌లో కూడా ఉంచుతామని వారు పేర్కొన్నారు.

05/10/2019 - 23:22

హైదరాబాద్, మే 10: ఇటీవల ఫొని తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ. 3 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. ఈనెల 4, 5 తేదీల్లో వచ్చిన ఫొని తుఫాన్‌తో ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో రైల్వే ఆస్తులకు నష్టాలు జరిగాయన్నారు. ఫొని తుఫాన్ ప్రభావంతో 137 రైళ్లకు అంతరాయం కల్గిందన్నారు.

05/10/2019 - 23:21

హైదరాబాద్, మే 10: ఖరీఫ్ సీజన్‌లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు వ్యవసాయ శాఖ సన్నద్ధంగా ఉందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి ఆదేశించారు. నేషనల్ ఇన్ఫర్‌మేటిక్ సెంటర్ ఇప్పటికే సంబంధిత శాఖలతో ప్రభుత్వ మద్దతు ధర కొనుగోళ్లకు సంబంధించి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించినట్లు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలకు సంబంధించి ఒక సమీకృత సాఫ్ట్‌వేర్‌ను ఆయా శాఖలతో చర్చించి రూపొందించాలన్నారు.

05/10/2019 - 23:20

హైదరాబాద్, మే 10: గీతం యూనివర్శిటీ హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగలూరు క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కౌనె్సలింగ్‌లో రెండు రోజులుగా విశేష స్పందన కనిపించిందని ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ తెలిపారు. ఈసారి గీతం యూనివర్శిటీ అందజేస్తున్న ఆకర్షణీయమైన ఫీజు రాయితీలు స్కాలర్‌షిప్‌లు ఎక్కువ మందికి ఉపయుక్తంగా మారాయని అన్నారు.

05/10/2019 - 23:20

హైదరాబాద్, మే 10: టీ శాట్ ద్వారా చట్టాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్టు సీఈఓ ఆర్ శైలేష్‌రెడ్డి శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అనేక ప్రత్యేక కార్యక్రమాలను అందించి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు తదితర విభాగాల ప్రశంసలు చూరగొన్న టీ శాట్ నెట్‌వర్కు చానళ్లు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.

Pages