S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/05/2019 - 04:30

మునగాల, మే 4: రాష్టవ్య్రాప్తంగా మూడు విడతల్లో జరగబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తొలి విడతలో జరిగే పరిషత్ ఎన్నికల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

05/05/2019 - 04:28

గుర్రంపోడు, మే 4: దేశానికి కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీ అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని కొప్పోలు, కట్టవారిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 23న వెలువడే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుపొంది దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

05/05/2019 - 04:25

తొర్రూరు, మే 4: ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో చేపట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు వరంగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

05/05/2019 - 04:20

హైదరాబాద్, ఏప్రిల్ 4: త్వరలో ఖరీఫ్ మొదలవుతున్నా పంటను ఆదుకునేందుకు రుణాలు ఇవ్వడం లేదు, రుణ మాఫీ జరగడం లేదని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

05/05/2019 - 03:45

హైదరాబాద్, మే 4: తెలంగాణ రైతులకు 2019 ఖరీఫ్ సీజన్‌కోసం అవసరమైన విత్తనాలను సకాలంలో అందిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. విత్తనాల పంపిణీపై చర్చించేందుకు శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు నాణ్యమైన విత్తనాలే కీలకంగా ఉంటాయన్నారు.

05/05/2019 - 03:44

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రభుత్వం కార్మికులకు అనుకూలమైనదని పేర్కొంటూ మేడే సాక్షిగా టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసత్యాలు చెప్పారని ఎఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్ ఎద్దేవా చేశారు. మేడే గుర్తింపు పొందిన ఎర్రజెండాను ఎగురవేయకుండా వారి పార్టీ జండా గులాబీ జండాను మాత్రమే ఎగురవేయడం మేడే స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

05/05/2019 - 03:43

హైదరాబాద్, మే 4: టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని చేస్తున్న ఉద్యమాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ నిరంకుశ ధోరణితో సాచివేత ధోరణిని అవలంభించారన్నారు.

05/05/2019 - 03:34

హైదరాబాద్, మే 4: రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయం నుంచి గ్రామస్థాయిలో ఉన్న రెవెన్యూ కార్యాలయం వరకు అందరూ స్మరించే పేరు చీఫ్ సెక్రటరీ. ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో చీఫ్ సెక్రటరీ సర్వాధికారి. ఆయననే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటారు. ప్రతి ఐఎఎస్ అధికారి చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ కావాలని కోరుకుంటారు. కాని ఈ అదృష్టం కొంత మందినే వరిస్తుంది.

05/04/2019 - 17:24

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్‌భవన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలను, విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయటంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గవర్నర్ జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

05/04/2019 - 13:01

ఖమ్మం: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్లదాడి జరిగింది. టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి లాకవర్తు సునీత కోసం ప్రచారం చేసేందుకు ఎమ్మెల్యే హరిప్రియ వచ్చారు. కామేపల్లి మండలం గోవింద్రాలలో ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు.

Pages