S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/24/2020 - 06:07

హైదరాబాద్, జనవరి 23: ప్రొఫెసర్ కాశిం అరెస్టు వెనుక కుట్ర ఉందని విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో పాలకులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

01/24/2020 - 06:00

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ నగరంలో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు కేవలం మజ్లిస్ పార్టీకే అనుమతి ఇస్తారా? అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈనెల 25వ తేదీన చార్మినార్ వద్ద మజ్లిస్ తలపెట్టిన ర్యాలీ, సభకు అనుమతి ఇవ్వోద్దని ఆయన డిమాండ్ చేశారు.

01/24/2020 - 05:58

హైదరాబాద్, జనవరి 23: పార్లమెంట్ ఎన్నికల్లో విశేష కృషి చేసినందుకు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీస్ అవార్డు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ను వరించింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఈ అవార్డుకు అంజనీ కుమార్‌ను ఎంపిక చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఈనెల 25న న్యూ ఢిల్లీలో రాష్టప్రతి చేతుల మీదుగా అంజనీ కుమార్ స్వీకరించనున్నారు.

01/24/2020 - 05:57

హైదరాబాద్, జనవరి 23: ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ముందస్తు చర్యలను తీసుకోవాలని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు.

01/24/2020 - 05:56

హైదరాబాద్, జనవరి 23: ఆర్థిక రంగ అభివృద్ధి నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా చిన్న డిపాజిటర్ల పొదుపుకు కార్పోరేట్ రంగానికి బ్యాక్‌డోర్ ప్రవేశం కల్పించడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించార.

01/24/2020 - 05:55

హైదరాబాద్, జనవరి 23: అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించే మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మేడారం జాతరపై ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.75 కోట్ల రూపాయాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

01/24/2020 - 01:20

ఆదిలాబాద్, జనవరి 23: ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలిచే కెస్లాపూర్ నాగోబా జాతర శుక్రవారం ప్రారంభం కానుంది.

01/24/2020 - 01:18

హైదరాబాద్, జనవరి 23: గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ వేదికపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడాదికి కేటీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే.

01/24/2020 - 01:13

హైదరాబాద్, జనవరి 23: ఆధునిక వ్యవసాయ పద్ధతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయ ఆధారిత రంగాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. హైదరాబాద్‌లో గురువారం నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర రుణ ప్రణాళిక సెమినార్‌లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు.

01/24/2020 - 01:11

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ. నాగిరెడ్డి పేరుతో గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.

Pages