S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/28/2020 - 01:28

హైదరాబాద్, జనవరి 27: ఎక్స్ అఫీషియోలకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కల్పించిందే కాంగ్రెస్ హయాంలోనని, ఇప్పుడు అదే పార్టీ ఇపుడు పెడబొబ్బలు పెడితే ఎలాగని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుప్రశ్నించారు. చట్టంలో కల్పించిన అధికారాన్ని తాము వినియోగించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పేరుకే జాతీయ పార్టీలు కానీ చేసేవన్నీ సిల్లీ రాజకీయాలని కేటీఆర్ దుయ్యబట్టారు.

01/28/2020 - 01:21

హైదరాబాద్: పంచాయతీ నుంచి పరిషత్ దాకా, పట్నం నుంచి పార్లమెంట్ దాకా, కౌన్సిల్ నుంచి అసెంబ్లీ దాకా ఎన్నికలేవైనా రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు అధికార టీఆర్‌ఎస్ బస్తీమే సవాల్‌గా తన సత్తా చాటుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో మునుపెన్నడూ పాలకపక్షం ఏకపక్షంగా విజయం సాధించిన ఉదంతాలు కనిపించవు. అయితే, ఇపుడు ఎన్నికల చరిత్రను తిరగరాసే విజయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది.

01/28/2020 - 01:18

హైదరాబాద్: రెండు మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నిక సోమవారం జరగాల్సి ఉండగా మంగళవారానికి వాయిదాపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా, 118 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికలు సోమవారం జరిగాయి. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికలు జరగలేదు.

01/28/2020 - 01:17

హైదరాబాద్, జనవరి 27: రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ల ఎన్నికల్లో తొమ్మిదింటికి తొమ్మిదిలోనూ టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. డిప్యూటీ మేయర్ల పదవులకు సంబంధించి నిజామాబాద్ డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకు కట్టబెట్టారు.

01/27/2020 - 07:06

భద్రాచలం టౌన్, జనవరి 26: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక పెద్దలు ఈ ఏడాది బ్రహ్మోత్సవాల తేదీలను ఆదివారం ఖరారు చేశారు. దేవస్థానం వైదిక కమిటీ అనేక సమాలోచనలు చేసి బ్రహ్మ ముహూర్తాన్ని నిర్ణయించింది. భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న శ్రీరామనవమిని నిర్వహించనున్నారు. మరుసటి రోజు 3న శ్రీరామ మహా పట్ట్భాషేకం జరుగుతుందని తెలిపారు.

01/27/2020 - 07:05

హైదరాబాద్, జనవరి 26: నేటి వర్తమాన రాజకీయాల్లో కాంట్రాక్టర్లు, ధనవంతులే రాజకీయాల్లో రాణిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో 71వ గణతంత్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ప్రవేశించినప్పుడు ధనప్రవాహం కన్పించలేదన్నారు.

01/27/2020 - 06:58

హైదరాబాద్: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడానికి మేడారం వెళ్లిరావడానికి ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో రెండు హెలికాప్టర్లను

01/27/2020 - 01:14

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ అందరినీ ఆత్మీయంగా పలకరించారు.

01/27/2020 - 01:11

హైదరాబాద్: భార త గణతంత్ర దినోత్సవం సందర్భం గా రాష్టస్థ్రాయిలో ఏర్పాటు చేసిన ఉత్సవం సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎగురవేసిన జాతీయ జెండా కొద్దిసేపు మొరాయించింది. షెడ్యూల్ ప్రకారమే ఆదివారం ఉద యం 10.30 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌కు వచ్చిన గవర్నర్‌కు ముఖ్యమం త్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు.

01/27/2020 - 01:07

హైదరాబాద్, జనవరి 26: రాష్టవ్య్రాప్తంగా ఇటీవల చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఏవిధంగా అమలవుతుందో, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తమ పరిధిలో విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలోనే తాను గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై కేసీఆర్ ఆదివారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు.

Pages