S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/21/2020 - 00:57

హైదరాబాద్: మున్సి‘పోల్స్’కు సంబంధించి ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఇక పోలింగ్ మాత్రమే మిగిలింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మున్సిపల్ కార్పొరేషన్లలో 325 వార్డులకు గాను ఇప్పటికే మూడు వార్డుల్లో కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

01/20/2020 - 05:03

హైదరాబాద్, జనవరి 19: బీజేపీకి మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టం కట్టాలని, మున్సిపాలిటీల అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచేస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఈ మ్యానిఫెస్టోను బీజేపీ ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విడుదల చేసింది.

01/20/2020 - 06:15

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి టిక్కెట్ల కోసం కోట్లు వసూలు చేశారని, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలిసి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, అవినీతి నిరోధక శాఖ ఈ విషయమై ఏమి చేస్తోందని ప్రశ్నించారు. సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు.

01/20/2020 - 04:59

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ నిమ్స్‌లోలో సీనియర్ న్యూరో ఫిజిషీయన్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ మీనాకుమారి ఆకస్మిక మృతి పట్ల సీపీఐ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందించారన్నారు. ఆమె పట్టుదలకు మారుపేరన్నారు.

01/20/2020 - 04:59

హైదరాబాద్, జనవరి 19: జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నియమించారు. 12 మందితో కూడిన ఈ కమిటీని కార్యకర్తల అభీష్టంతో ఎంపిక చేశారు. అధ్యక్షునిగా రాధారం రాజలింగం, ప్రధాన కార్యదర్శిగా చిన్నమదిరెడ్డి దామోదర రెడ్డిలు నియమితులయ్యారు.

01/20/2020 - 04:57

హైదరాబాద్, జనవరి 19: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు మద్దత్తు ఇవ్వాలని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలసి వారు తమ మద్దత్తును ప్రకటించారు.

01/20/2020 - 04:55

హైదరాబాద్, జనవరి 19: ఉపాధ్యాయ సంఘాలు విలీనం కావడంతో ఒకటైన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఇక భవిష్యత్ కార్యాచరణకు ముందడుగు వేసినట్లేనని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల విలీన ప్రక్రియ జరిగింది.

01/20/2020 - 04:55

హైదరాబాద్, జనవరి 19: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా మెలగాలని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని తెలంగాణ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐ) కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు.

01/20/2020 - 04:53

హైదరాబాద్, జనవరి 19: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం వల్లనే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ పరిసరాల్లోని అనేక మున్సిపాలటీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ డబ్బులతో గెలవాలని చూస్తోందని, కేసీఆర్ ఎత్తులను చిత్తు చేయాలని ప్రజలను కోరారు. తెలంగాణను కేసీఆర్, ఒవైసీ కుటుంబాల నుంచి విముక్తి చేయించాలన్నారు.

01/20/2020 - 01:17

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గత వా రం పదిరోజుల నుండి ముమ్మరంగా కొనసాగిన మున్సిపోల్స్ ప్రచారం సోమవారం సాయంత్రం ముగియనుంది. ఈనెల 22న ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుండడం వల్ల 36 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అందువల్ల సోమవారం సాయంత్రమే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది. కాగా, పోలింగ్ నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Pages