S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/29/2020 - 01:55

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఆదేశం మేరకు పోలీసులు రజాకార్ల కంటే దారుణంగా ప్రవర్తించారని, ఈ అరాచకానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపపల్ ఎన్నికల ప్రకటనకు ముందే జిల్లా మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం బ్లాక్‌మెయిల్ చేశారన్నారు.

01/29/2020 - 01:54

హైదరాబాద్: మున్సిపల్ పాలక వర్గాల్లో గతంలో ఎప్పుడైనా సామాజిక న్యాయాన్ని పాటించారా? అని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాజకీయంగా ఇంతవరకు గుర్తింపు లభించని వర్గాలకు కూడా

01/29/2020 - 01:53

హైదరాబాద్, జనవరి 28: రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్లమెంట్ సమావేశాల్లో గళమెత్తాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షపై పార్లమెంట్‌లో ఎండగట్టాలని నిర్ణయించింది.

01/29/2020 - 01:48

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ కరోనా వైరస్ సోకుతోందంటూ వస్తున్న వదంతులు నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌కు సం బంధించి వైద్య ఆరోగ్య శాఖ అన్ని కోణాల్లో పరిశీలిస్తోందన్నారు.

, ,
01/28/2020 - 06:46

నల్లగొండ, జనవరి 27: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తత మధ్య సాగాయి. చౌటుప్పల్ మున్సిపాల్టీలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా సీపీఎం సభ్యులు ముగ్గురు కాంగ్రెస్‌కు జలక్ ఇచ్చి టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడంతో స్థానిక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాంతో ఆందోళనకు దిగడం ఘర్షణలకు దారితీసింది.

01/28/2020 - 06:24

కరీంనగర్, జనవరి 27: అధికార తెరాసకు పుట్టినిల్లయిన కరీంనగర్‌లో ఆ పార్టీ మరోసారి విజయఢంకా మోగించింది. బల్దియా ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి తన ఖాతా పునరుద్ధరించుకొని పట్టు నిలుపుకుంది. 60 డివిజన్లకు గాను 33 చోట్ల గెలిచి తన ప్రాబల్యాన్ని చాటుకుంది. నాలుగుచోట్ల వంద లోపు ఓట్లతో సీట్లు చేజార్చుకోగా, 13 డివిజన్లలో బీజేపీ అనూహ్యంగా దూసుకుపోయింది.

01/28/2020 - 06:24

మహబూబ్‌నగర్, జనవరి 27: మున్సిపల్ ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో తెరాస పాగా వేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో 15 పురపాలికల్లో టీఆర్‌ఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు గెలుపొందారు. మక్తల్‌లో పురపాలికలో బీజేపీ, వడ్డేపల్లి ము న్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్లు కైవసం చేసుకున్నారు.

01/28/2020 - 06:48

సూర్యాపేట, జనవరి 27: సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పెరుమాళ్ల అన్నపూర్ణ ప్రమాణస్వీకారం అనంతరం ఉద్వేగంతో కన్నీళ్ల పర్యంతమై మంత్రి జగదీశ్‌రెడ్డి చేతకూడా కన్నీళ్లు పెట్టించారు.

01/28/2020 - 06:21

నిజామాబాద్, జనవరి 27: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇందూరు నగర పాలక సంస్థతో పాటు అన్ని మున్సిపల్ చెర్మన్ పదవులను అధికార టీఆర్‌ఎస్ పార్టీ సునాయసంగా కైవసం చేసుకుంది. కీలక పదవుల కోసం ప్రతిపక్ష పార్టీల నుండి నామమాత్రంగానైనా పోటీ ఎదురుకాలేకపోయింది. పైపెచ్చు కాంగ్రెస్, ఎంఐఎం సహా స్వతంత్ర అభ్యర్థులంతా మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా తెరాసకు బాసటగా నిలువడం విశేషం.

01/28/2020 - 01:32

కొలను నీలా గోపాల్ రెడ్డి
(నిజాంపేట్)
జక్కా వెంకట్‌రెడ్డి
(్ఫర్జాదిగూడ)
సామల బుచ్చిరెడ్డి
(బోడుప్పల్)
మహేందర్‌గౌడ్
(బండ్లగూడ జాగీర్)
చిగురింత పారిజాత (బడంగిపేట)
ముడవత్ దుర్గ
(మీర్‌పేట)
దండు నీతు కిరణ్
(నిజామాబాద్)
బంగి అనిల్‌కుమార్ (రామగుండం)
*
మున్సిపల్ ఎన్నికల చరిత్రను

Pages