S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/02/2018 - 01:54

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణపై అసెంబ్లీ ఎన్నికల ప్రకటన జారీ అయ్యే సమయంలో రాష్ట్రంలోనే అత్యంత కీలక కేంద్రంగా భావిస్తున్న కరీంనగర్‌లో మహాసభను నిర్వహించడం ద్వారా దూకుడు పెంచాలని బీజేపీ భావిస్తోంది.

10/02/2018 - 04:04

హైదరాబాద్, అక్టోబర్ 1: రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న, పెసర, మినుము, కందులు, సోయాబీన్ కొనుగోలును మంగళవారం నుండి ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయం, మార్కెటింగ్ తదితర శాఖల ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు.

10/01/2018 - 17:33

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నిర్వహణకు అన్నిరకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజిత్‌కుమార్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లకు సరిపడా ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని, మరో వంద పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు సరఫరా చేసేందుకు భెల్ కంపెనీ సిద్ధంగా ఉందని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా 19.5 లక్షల ఓటర్లు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.

10/01/2018 - 17:31

హైదరాబాద్: నెంబర్‌వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని టీపీసీసీ ప్రెశిడెండ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో అనే నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వం యథేచ్చగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోవటం లేదని అన్నారు.

10/01/2018 - 13:13

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు, లెక్కకు మించిన నగదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓటుకు నోటు కేసు నిందితులు సెబాస్టియన్, ఉదయ్‌సిన్హాలను ఐటీ అధికారుల విచారణ సోమవారంనాడు కొనసాగింది. కీలకపత్రాలను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఈనెల 3న రేవంత్‌రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసు నిందితులను కూడా విచారించే అవకాశం ఉంది.

10/01/2018 - 13:11

హైదరాబాద్: తెలంగాణలో గడీల పాలనకు చరమగీతం పాడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ సోనియాను దూషించిన కేటీఆర్ మూర్ఖుడని అన్నారు. సోనియా లేకపోతే కేటీఆర్, కవిత ఎక్కడ ఉండేవారని అన్నారు.

10/01/2018 - 13:09

మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. ముందుగా రాయపట్నం గ్రామంలోని అంబేద్కర్, ఎన్టీయార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ప్రచారంలో బాలయ్య అభిమానులు మోటారు సైకిళ్లతో ర్యాలీ పాల్గొన్నారు.

10/01/2018 - 06:21

సిద్దిపేట, సెప్టెంబర్ 30: తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అమరావతికి తాకట్టు పెట్టి.. అస్థిత్వానికి ఎసరు పెడుతోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటమే అంటే తెలంగాణ వ్యతిరేకులతో చేతులు కలపడమేనని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

10/01/2018 - 06:20

* అధికశాతం మంది కోట్లకు పడగలెత్తినవారే *56 శాతం మందిపై క్రిమినల్ కేసులు *39 శాతం మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు

10/01/2018 - 06:18

ధర్మపురి, సెప్టెంబర్ 30: నాలుగు వసంతాలకు పైబడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి ప్రభుత్వ ఏలుబడిలో, ఏలికకు అడుగడుగునా అసంతృప్తులు ఎదురైనా, వాటిని ఎప్పటి కపుడు దాటవేస్తూ, ప్రజల దృష్టికి వాటిని పెద్దవి కానీకుండా, తమదైన శైలిలో పరిపాలన కొనసాగించి సమయస్ఫూర్తికి మారుపేరుగా నిలిచారు కేసీఆర్.

Pages