S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/30/2018 - 02:55

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ప్రభుత్వ పథకాల పోస్టర్లను చించేయండి అని ఏఐసీసీ కార్యదర్శి, పీసీసీ ఎన్నికల వ్యూహ, ప్రణాళిక కమిటీ చైర్మన్ వీ. హనుమంత రావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వానికి మూడు రోజుల గడువు ఇవ్వాలని ఆయన సూచించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే నాలుగో రోజు ఉదయం నుంచే ప్రభుత్వ ప్రచారాల పోస్టర్లను, బ్యానర్లను, ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన తెలిపారు.

09/30/2018 - 02:54

హైదరాబాద్, సెప్టెంబర్ 29: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క, ప్రజా గాయకుడు గద్దర్ శనివారం సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. గద్దర్ భట్టివిక్రమార్క నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భంగా ఇరువురూ ముందస్తు ఎన్నికలు, విపక్షాల ఐక్యత, మహాకూటమి ఏర్పాటు, పొత్తుల అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపై పోటీ చేయాలని భట్టి ఆయనకు సూచించారు.

09/30/2018 - 02:52

హైదరాబాద్, సెప్టెంబర్ 29: అన్ని రాజకీయ పార్టీలూ తమ మేనిఫెస్టోల్లో విద్యార్థి సమస్యలకు పరిష్కారాలను చూపాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప కోరారు. ఏబీవీపీ సైతం తెలంగాణ విద్యార్థి మేనిఫెస్టోను తయారుచేసిందని అన్నారు.

09/30/2018 - 02:51

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పగటి కలలు కంటున్నారని బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీకి గ్రాఫ్ తగ్గిందంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. అన్ని సర్వేలూ బీజేపీకి 300కిపైగా సీట్లు వస్తాయని చెబుతున్నాయని స్పష్టం చేశారు.

09/30/2018 - 02:51

హైదరాబాద్, సెప్టెంబర్ 29: అత్యాధునికమైన ‘హార్ట్ కమాండ్ సెంటర్’ను సికింద్రాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. అపోలో గ్రూపు హాస్పిటల్స్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ శివ్ కుమార్, ఇతర కన్సల్టెంట్ డాక్టర్లు పాల్గొన్నారు.

09/30/2018 - 02:50

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత నందమూరి హరికృష్ణ జ్ఞాపకార్థం ‘మహామంత్రస్య’ గ్రంథాన్ని బంధుమిత్రులకు, రాజకీయ ప్రముఖులకు అందజేశారు. ఈ మహాకార్యాన్ని ఎన్టీఆర్ పెద్ద కుమార్తె, హరికృష్ణ సోదరి లోకేశ్వరి భుజన ఎత్తుకున్నారు.

09/29/2018 - 06:21

డిచ్‌పల్లి రూరల్, సెప్టెంబర్ 28: తెరాసను వీడిన రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిలతో వచ్చే నష్టమేమీ ఉండదని, పార్టీ శ్రేణులు ఈ విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

09/29/2018 - 06:20

నల్లగొండ, సెప్టెంబర్ 28: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తన పాలనా వైఫల్యాల కారణంగా తిరిగి మరోసారి ఎన్నికల్లో గెలువలేమని గ్రహించే కాంగ్రెస్‌తో పాటు విపక్ష నాయకులపై దాడులను జరిపిస్తున్నారని మాజీ మంత్రి, టీ.పీసీసీ మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

09/29/2018 - 06:19

కరీంనగర్, సెప్టెంబర్ 28: మీ గట్టున ఉండి పరిపాలనను చూసిన ప్రజలు ఇప్పుడు మా గట్టున ఉన్నారని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ విశ్వసనీయత, టీఆర్‌ఎస్ విశ్వసనీయత ఏమిటో ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ధర్మం, నిజాయితీ గెలుస్తుందని తెలిపారు.

09/29/2018 - 06:17

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 28: పరివర్తన చెందిన ఖైదీల సంక్షేమానికి రాష్ట్రంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో సుమారు 100 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 16 పూర్తయ్యాయని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్‌సింగ్ అన్నారు.

Pages