S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/29/2018 - 00:42

హైదరాబాద్, సెప్టెంబర్ 28: బతుకమ్మ చీరలు రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయాలని తెలంగాణ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ చీరలపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఫొటోలు, గులాబీ జెండాల ఫొటోలు ఉండరాదని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రజత్ కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

09/29/2018 - 00:41

హైదరాబాద్, సెప్టెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నాయకులపై వేధింపులకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పాలనకు చరమ గీతం పాడనున్నారని ఆమె హెచ్చరించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఆమె రేవంత్ నివాసం వద్దకు చేరుకున్నారు.

09/29/2018 - 00:41

హైదరాబాద్, సెప్టెంబర్ 28: టీపీసీసీకి అనుబంధ విభాగమైన మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా కే. తిరుపతమ్మ కృష్ణ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ళ శారద శుక్రవారం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా, వీరపనగండ్ల మండలం, సంగినేనిపల్లి గ్రామానికి చెందిన తిరుపతమ్మ గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

09/29/2018 - 00:40

హైదరాబాద్, సెప్టెంబర్ 28: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ ఎత్తివేయాలని బీహెచ్‌ఇఎల్-ఒబీసీ ఉద్యోగుల సంఘం ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేసింది. శుక్రవారం బీహెచ్‌ఇఎల్-ఒబీసీ ఉద్యోగుల సాధారణ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

09/29/2018 - 00:40

హైదరాబాద్, సెప్టెంబర్ 28: రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఈ నెల 30న నిర్వహించాలనుకున్న ‘జాబ్ మేళా’ వాయిదా పడింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నియమ-నిబంధనలు (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమల్లోకి వచ్చినందున జాబ్ మేళాను వాయిదా వేశామని పరిషత్ చైర్మన్ కేవీ రమణా చారి తెలిపారు.

09/28/2018 - 06:03

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ముమ్మారు తలాక్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను న్యాయస్థానంలో సవాలు చెయ్యాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. గురువారం నాడు దారుసలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని చెప్పారు.

09/28/2018 - 06:02

హైదరాబాద్, సెప్టెంబర్ 27: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లపై ఐటీ సోదాలు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఐటీ సోదాలను టీపీసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, వి హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

09/28/2018 - 04:11

యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 27: రాజకీయ జీవితం ప్రసాదించింది నందమూరి తారక రామారావు అని, ఆయనకు నమ్మక ద్రోహం చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తననూ అన్ని విధాలుగా మోసం చేశారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడని ఆయన ఆరోపించారు.

09/28/2018 - 04:09

వరంగల్, సెప్టెంబర్ 27: వరంగల్ ఎంజీయం ఆసుపత్రిలో గురువారం తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఎంజీయం పిల్లల వార్డులోని ఏసీల్లో అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో ఏసీల నుండి పొగలు, మంటలు రావడంతో ఒక్కసారిగా అందులో ఉన్న రోగులు, అటెండెంట్లు వైద్యులు చికిత్స పొందుతున్న పిల్లలను తీసుకుని పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వార్డులో 23 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు.

09/28/2018 - 04:07

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 27: పీసీసీ అధ్యక్షులు ఉత్తమకుమార్‌రెడ్డి ఇస్తున్న వాగ్దానాలకు దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని, ఓట్లకోసం ఉత్తమ్ ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు.

Pages