S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/12/2018 - 17:28

హైదరాబాద్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ స్థలాల కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని గత కొనే్నళ్లుగా విచారణ జరుగుతుంది. ఈ సొసైటీకి 2003 నుంచి 2005 వరకు రేవంత్‌రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. కాగా తాను ఎన్నికలలో నిమగ్నమై ఉన్నందున తనకు కొంత గడువు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి పోలీసులను కోరారు.

09/12/2018 - 13:58

కొండగట్టు: కొండగట్టు ప్రమాద బాధితులను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, పార్టీ నేతలు పరామర్శించారు. కొండగట్టు ప్రమాదస్థలాన్ని పరిశీలించిన అనంతరం బాధిత కుటుంబాలకు రూ. 25వేల చొప్పున ఆర్థికసాయం చేశారు.

09/12/2018 - 13:57

హైదరాబాద్: అమరవీరుల స్మృతి చిహ్నం, అంబేడ్కర్‌ భారీ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ సంస్మరణ దీక్ష చేపట్టారు.

09/12/2018 - 13:56

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో దాఖలుచేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన జరగనప్పుడు తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

09/12/2018 - 05:38

* రేవంత్‌రెడ్డిపైనే రమేష్‌రెడ్డి ఆశలు * గెలిచే వారికే టికెట్ వస్తుందంటూ పటేల్ ప్రకటనలు

09/12/2018 - 05:34

మెదక్, సెప్టెంబర్ 11: మెదక్ జిల్లాలో మత్య్స పరిశ్రమ వెలవెలబోతోంది. వర్షాలు లేక జిల్లాలో చేపల ఉత్పత్తిని అనుకున్న లక్ష్యాన్ని జిల్లా అధికారులు సాధించలేకపోతున్నారు. జిల్లాలో 1591 చెరువులు ఉన్నాయని, అందులో 1273 గ్రామపంచాయితీలు, 315 డిపార్ట్‌మెంట్ చెరువులు, మూడు రిజర్వాయర్లు ఉన్నట్లు జిల్లా మత్య్సశాఖ ఇంచార్జీ అధికారి శ్రీనివాస్ మంగళవారం మాట్లాడుతూ తెలిపారు.

09/12/2018 - 02:39

యాదగిరిగుట్ట రూరల్,సెప్టెంబర్ 11:ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో తెలంగాణ అన్నిరంగాలలో అభివృద్ధి చేశారని, తెలంగాణ ఫలాలు తెలంగాణ వాసులకే దక్కుతున్నాయని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు ఖాయమని ప్రతి పక్షాలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వక తప్పదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.

09/12/2018 - 02:36

చౌటుప్పల్, సెప్టెంబర్ 11: దేశంలోనే ప్రథమంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశామని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.జా వెల్లడించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్మృతి వనం చారిత్రాత్మకమన్నారు. చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని మంగళవారం అటవీ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

09/12/2018 - 02:34

హైదరాబాద్, సెప్టెంబర్ 11: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు అక్టోబర్ 4న పరీక్ష నిర్వహించనున్నట్టు నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ చెప్పారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించినట్టు ఆమె పేర్కొన్నారు. అక్టోబర్ 4న నిర్వహించే ఈ పరీక్షకు ఫీజు చెల్లించే గడువు సెప్టెంబర్ 14 వరకూ పొడిగించామని అన్నారు.

09/12/2018 - 02:23

సంగారెడ్డి, సెప్టెంబర్ 11: మనుషుల అక్రమ రవాణా ఆరోపణలపై ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని నగరంలోని ఉత్తర మండలం పోలీసులు అరెస్టు చేయడంలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం రాత్రి పొద్దుపోయాక పటన్‌చెరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్త నియోజకవర్గంలో వ్యాపించింది.

Pages