S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/17/2018 - 02:39

గద్వాల, ఆగస్టు 16: గత నాలుగు రోజులగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాంతాలు వర్షపు నీటితో ప్రాజెక్టులను వరద ముంచెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.360 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది.

08/16/2018 - 06:24

హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఐదవసారి చారిత్రాత్మక గోల్కొండ కోట వేదికైంది. ఈసారి కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను గోల్కొండ కోటపై ఎగురవేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు, నృత్య ప్రదర్శనలను కన్నుల పండుగగా నిర్వహించారు.

08/16/2018 - 06:23

హైదరాబాద్, ఆగస్టు 15: హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘ఎట్‌హోం’ ఆహ్లాదకరంగా కొనసాగింది. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు గంటసేపు కొనసాగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం వేళ ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేసి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ.

08/16/2018 - 06:23

హైదరాబాద్, ఆగస్టు 15: రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా, మధ్య దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర మత్స్య, పాడిపరిశ్రమల సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ‘మహా భారతంలో ధర్మరాజు గురించి విన్నాం.

08/16/2018 - 06:21

హైదరాబాద్, ఆగస్టు 15: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ నెల 16న (గురువారం) బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సభ నిర్వహించనున్నది. అయితే హిమాయత్‌నగర్‌లోని ఏవీ కళాశాల ప్రాంగణంలో సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆప్ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు బి.రాముగౌడ్, నసీం బేగం, శ్రీదేవి తదితరులు పోలీసు అధికారులను లిఖితపూర్వకంగా కోరారు.

08/16/2018 - 06:20

హైదరాబాద్, ఆగస్టు 15: కేంద్ర పథకాలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత జీ. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు రోజుల పాటు పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు.

08/16/2018 - 06:19

హైదరాబాద్, ఆగస్టు 15: సింగరేణి గనుల్లో పని చేస్తున్న కార్మికులు తమ పని గంటలను మెరుగుపడాలని, గనుల్లో నిర్దేశించిన లక్ష్యాలను అధికమించడానికి కృషి చేయాలని సంస్థ సీఎండీ శ్రీ్ధర్ సూచించారు. గనుల్లో వేగంగా బొగ్గు ఉత్తత్తికి ఆధునిక యంత్రాలను తీసుకువస్తున్నామని కార్మికులు అందుకు తమ పని గంటలల్లో మెళకువలతోపాటు నైపుణ్యతను సాధించాలన్నారు.

08/15/2018 - 05:57

హైదరాబాద్, ఆగస్టు 14: రాహుల్ గాంధీ మాటలు విని మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తెరాస రెండూ దొందూ దొందేనని , కేసీఆర్ మాటలకు, చేతలకు సంబంధం లేదని పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాహుల్ మాట్లాడుతున్న విధానం అపరిపక్వత , నిరాశ, నిస్పృహలతో కూడుకున్నట్టుందని అన్నారు.

08/15/2018 - 05:55

హైదరాబాద్, ఆగస్టు 14:సింగరేణిలో పని చేస్తున్న కార్మికులను ఉత్తేజపర్చడానికి, సంస్థ లక్ష్యాలను పెంపొందించడానికి చేపట్టిన గీతాల ఆడియో సిడిని సంస్థ అధికారులు ఆవిష్కరించారు. మంగళవారం సింగరేణి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కదలిరండి, కదలిరండి అంటూ గీతాలతోకూడిన సిడిలను విడుదల చేశారు. బుధవారం నాడు సింగరేణి అన్ని ఏరియాల్లో పంద్రాగస్టు వేడుకల్లో సిడిల గీతాలను వినిపించనున్నారు.

08/15/2018 - 05:53

హైదరాబాద్, ఆగస్టు 14: శ్రీవికారి నామ సంవత్సరంలో పండగల తేదీలను తెలంగాణ విద్వత్సభ నేతృత్వంలో జరిగిన జ్యోతిష మహాసభ మంగళవారం ప్రకటించింది. తెలంగాణ విద్వత్సభ నేతృత్వంలో ‘జ్యోతిష మహాసభలు-2018’ రవీంద్రభారతిలో సోమ, మంగళవారాల్లో జరిగాయి. ఈ సభల్లో దాదాపు వంద మంది పండితులు చర్చించి పండగల తేదీలను నిర్ణయించారు. సభ నిర్ణయించిన పండగ తేదీలు ఇలా ఉన్నాయి. ఉగాది 2019 ఏప్రిల్ 6.

Pages