S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/08/2018 - 05:54

హైదరాబాద్, మే 7: తెలంగాణలో రైతుల నుండి 2017-18 రబీ (యాసంగి)లో మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు నోడల్ ఏజన్సీగా ఎంపికైన మార్క్‌ఫెడ్‌కు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో యాసంగిలో 3.69 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేయగా, 5.49 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అయింది.

05/08/2018 - 05:50

హైదరాబాద్, మే 7: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లో బెట్టింగ్‌లో పతాక స్ధాయికి చేరాయి. హైదరాబాద్‌లో ఉంటూనే వివిధ రాష్ట్రాల్లో ఉన్న పంటర్లను తమ నెట్ వర్క్‌లోకి తీసుకుని విచ్చలవిడిగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి భారీ బెట్టింగ్ వ్యవహారాన్ని తాజాగా నగర టాస్క్ఫోర్స్ పోలీసులు గుట్టు రట్టు చేశారు.

05/08/2018 - 05:49

హైదరాబాద్, మే 7: నేరుగా ఇంజనీరింగ్ యుజి కోర్సులో చేరేందుకు డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఈ నెల 9వ తేదీన ఆన్‌లైన్ ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ డాక్టర్ ఎ గోవర్ధన్ తెలిపారు. ఇందుకోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 14 రీజనల్ సెంటర్లలో 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.

05/07/2018 - 05:11

హైదరాబాద్, మే 6: మార్కెట్లో విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీ నిరోధానికి పోలీసు శాఖతో కలిసి పనిచేయాలని తెలంగాణ తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ తన శాఖ అధికారులను ఆదేశించారు. వినియోగదారుల రక్షణే పరమావధిగా భావించి పని చేయాలని సూచించారు. కల్తీని అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

05/07/2018 - 05:10

హైదరాబాద్, మే 6: మహిళలు మరింత భద్రతగా ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది మెట్రోరైల్ లిమిటెడ్. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం పూర్తి చేసుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పరుగులు పెడుతున్న మెట్రో రైల్లో మహిళల కోసం ప్రత్యేక బోగీని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

05/07/2018 - 05:08

హైదరాబాద్, మే 6: కరడుగట్టిన నేరస్తుడు మీర్జా ఆజాంబేగ్ (31)పై చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పీడీ చట్టం విధించారు. నిందితుడు అనేక నేరాలతో సంబంధం కలగి ఉండడమే కాకుండా ఎంతోమందిని బెదిరించడం, దాడులు చేయడంలో ఆరితేరినట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో డ్రైవర్‌గా వృత్తి చేసుకుంటూ జీవించే బేగ్ నేరాలకు అలవాటు పడ్డాడు.

05/07/2018 - 05:06

హైదరాబాద్, మే 6: తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) విషయంలో టీటీడీ మినహా ఇతరులెవరూ జోక్యం చేసుకోవడం సముచితం కాదని విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, టీటీడీ ఏర్పాటయినప్పటి నుండి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో హిందూ సంప్రదాయ ప్రకారం, శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా పూజలు జరుగుతున్నాయన్నారు.

05/07/2018 - 05:05

హైదరాబాద్, మే 6: పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. కుటుంబ పరిస్థితులు, ఉద్యోగంలో సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే బాగా చదువుకుని ఉన్నతంగా స్థిరపడాలని అన్నారు.

05/05/2018 - 05:35

హైదరాబాద్, మే 4: దేవాదాయ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (ఈవో)లకు చార్జ్ మెమోలు జారీ చేసినట్టు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శాఖలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన అధికారులతో పా టు, కింది స్ధాయి సిబ్బందిపై రెండు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.

05/05/2018 - 05:34

హైదరాబాద్, మే 4: ఇంటర్మీడియట్ బోర్డు, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వేసవిలో ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల తరగతులను నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీలు నిర్వహించి, విద్యార్ధులను బయటకు పంపించి, యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి ఆయా కాలేజీలకు తాళాలు వేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ తెలిపారు.

Pages