S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/15/2018 - 03:52

హైదరాబాద్, మే 14: రైతుబంధు పథకం కింద మరికొంత మంది రైతుల పేర్లతో కూడిన మరొక జాబితాను సోమవారం ప్రభుత్వం బ్యాంకర్లకు అందచేసింది. సచివాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి ఈ జాబితాను బ్యాంకర్లకు అందజేశారు.

05/15/2018 - 03:43

హైదరాబాద్ 14 మే: రానున్న రోజుల్లో మే 14న తెలంగాణ క్రీడాకారులు పండుగ చేసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి పద్మారావుగౌడ్ అన్నారు. సోమవారం సచివాలంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ప్రభుత్వం 2 శాతం రిజర్వేషన్లును అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉత్తర్వులు ఇచ్చారని ఆయన చెప్పారు.

05/15/2018 - 03:41

హైదరాబాద్, మే 14: ఆఫీసే లేని, అనుభవం ఏ మాత్రం లేని ఓ ప్రైవేటు సంస్థకు సింగరేణి సంస్థ టెండర్ కేటాయించిందని టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. కన్సల్టెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు 204 కోట్ల రూపాయల విలువ గల టెండర్ కట్టబెడతారా? అని గూడూరు నారాయణ రెడ్డి సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

05/15/2018 - 03:40

హైదరాబాద్, మే 14: ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచి, కన్నడ, మరాఠీ పరీక్షలు జరిగాయి. పరీక్షకు 93,281 మంది రిజిస్టర్ చేసుకోగా, 86,609 మంది పరీక్షలకు హాజరయ్యారు. 6672 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.

05/15/2018 - 03:39

హైదరాబాద్, మే 14: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వేసవి తాపంతో అల్లాడిపోయిన నగరవాసులకు కొంత ఉపశమనం కలిగింది. క్యుములోనిబంస్ మేఘాల కారణంగా రుతుపవనాలు రాకముందే వర్షాలు పలుచోట్ల పడడం ప్రారంభమైంది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది.

05/15/2018 - 04:49

హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం తమ ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు చేస్తున్నాయి. ఫీజులు సైతం అదుపులేకుండా వసూలు చేస్తుండటంపై తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

05/15/2018 - 03:36

హైదరాబాద్, మే 14: విజయ్ భాస్కర్ మరణం ఆదివాసీ లోకానికి తీరని లోటని సంస్మరణ సభలో వక్తలు పేర్కొన్నారు. ఆదివాసీ హక్కులకోసం ఆయన తుదిశ్వాస వరకు పోరాడిన మహామనీషి అని శ్లాఘించారు. సోమవారం నగరంలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో చెంచులోకం ఆధ్వర్యంలో ఇటీవల మృతిచెందిన ఆదివాసీ ఉద్యమ కారుడు విజయ్ భాస్కర్ సంస్మరణ సభ నిర్వహించారు.

05/15/2018 - 03:36

హైదరాబాద్, మే 14: కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రైతుబంధు కార్యక్రమానికి తాము వ్యతిరేకమని బాహాటంగా ప్రకటించి చెక్కుల పంపిణీ ప్రక్రియను బహిష్కరించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సవాల్ విసిరారు. ఇప్పటివరకు అన్నదాతకు అండగా నిలిచింది ఎవరూ లేరని, కేసీఆర్ ఒక్కరే అండగా ఉన్నారని అన్నారు.

05/15/2018 - 03:35

హైదరాబాద్, మే 14: రిజర్వేషన్లు పొందుతున్న ఏ వర్గానికి లేని విధంగా బీసీలకు మాత్రమే పొందుపరిచిన క్రిమీలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ను బీసీ ఉద్యోగులు విన్నవించారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘంతో కలిసి మంత్రికి లేఖ రాశారు. రైతుబంధు పథకానికి లేని క్రిమిలేయర్ బీసీలకు ఎందుకని లేఖలో ప్రశ్నించారు.

05/15/2018 - 03:34

హైదరాబాద్, మే 14: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తూప్రాన్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ సంవత్సరం జనవరి 17 న కేసీఆర్ తూప్రాన్ పర్యటించిన సందర్భంగా సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, మురుగునీటి పారుదలకు అవసరమైన నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు.

Pages