S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/01/2018 - 05:14

హైదరాబాద్, ఏప్రిల్ 30: కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి కేవలం అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శులకు మాత్రమే పిటీషన్ వేసే అర్హత ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వి సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనర్హత కేసులో జోక్యం చేసుకునే హక్కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు లేదని అభిషేక్ సింఘ్వి వాదించారు.

05/01/2018 - 05:12

హైదరాబాద్, ఏప్రిల్ 30: కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టక పోతే రాష్టవ్య్రాప్తంగా ఉద్యమిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరింరు. సోమవారం బీసీ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇంటర్ అడ్మిషన్లను డిగ్రీ అడ్మిషన్ల మాదిరిగా కేంద్రీకృత పద్దతిలో ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు.

05/01/2018 - 05:09

హైదరాబాద్, ఏప్రిల్ 30: విద్యాశాఖలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

05/01/2018 - 05:07

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న జూనియర్ కాలేజీలపై టాస్క్ఫోర్సుల దాడులు కొనసాగుతున్నాయి. ఇంత వరకూ 396 కాలేజీలకు ఈ బృందాలు మూత వేయగా, సోమవారం మరో 47 జూనియర్ కాలేజీలకు తాళాలు వేశారు.

05/01/2018 - 05:04

హైదరాబాద్, ఏప్రిల్ 30: ప్రజాసంక్షేమం, పేదల అభివృద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని, పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ చరిస్మా పల్లెపల్లెల్లో విస్తరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.

04/30/2018 - 04:57

కరీంనగర్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించిన ప్లీనరీ సమావేశం వేదికగా ఆ పార్టీ అధిపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఓ వైపు ఆనందం..మరోవైపు ఆందోళన నెలకొంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా వజ్రాలు..

04/30/2018 - 04:56

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 29: భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి నియమితులయ్యారు. ఈనెల 25 నుంచి 29వరకు కేరళ రాష్ట్రంలోని కొల్లాం లో నిర్వహించిన ఆ పార్టీ జాతీయ మహాసభల్లో ప్రకటించిన నూతన కార్యవర్గంలో ఆయనకు చోటు లభించింది.

04/30/2018 - 04:56

మిర్యాలగూడ, ఏప్రిల్ 29: రాష్ట్రంలో మే 10 నుండి రైతుబంధు పథకం కింద సుమారు 58 లక్షల మంది రైతులకు ఆరువేల కోట్ల రూపాయలు పెట్టుబడిని పంపిణీ చేసేందుకు చెక్కులు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్త సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

04/30/2018 - 05:06

హైదరాబాద్: ‘కేసీఆర్ ఇగ చూస్కో.. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అనుసరిస్తున్న కుటుంబ పాలన, నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణ సమాజానికి విముక్తి కలిగిస్తాం’ అంటూ పలువురు తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.

04/30/2018 - 04:46

హైదరాబాద్, ఏప్రిల్ 29: మద్యం తాగి వాహనాలు నడిపేవారిని పోలీసులు పట్టుకుని శిక్షిస్తున్న విధంగా, ఎన్నికల సమయంలో తాగి పోలింగ్ కేంద్రానికి వచ్చే వారిని ఓటు వేయకుండా నిరోధిస్తారా అంటూ ‘నెటిజ న్లు’ ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఒక ‘పోస్ట్’ వాట్సాప్‌లోని వివిధ గ్రూపు ల్లో హల్‌చల్ చేస్తోంది. తాగి వాహ నం నడిపే వారిని పరీక్షించేందుకు ‘బ్రీత్ ఎనలైజర్లు’ వాడుతున్నారు. తాగినట్టు తేలితే శిక్షిస్తున్నారు.

Pages