S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/05/2018 - 05:32

హైదరాబాద్, మే 4: ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో ఉన్న కోఠీ మహిళా అటానమస్ కాలేజీకి మహిళా యూనివర్శిటీ హోదా కల్పిస్తూ రా ష్ట్ర ప్రభుత్వం నేడో రేపో ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్టు తెలిసింది. 96 ఏళ్లగా ఉన్న కోఠీ మహిళా కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే గాక, ఆంధ్రాలోనూ ఖ్యాతి గడించింది. 2018-19 విద్యాసంవత్సరం నుండే కోఠీ మహిళా కాలేజీకి యూనివర్శిటీ హోదా కల్పించనుంది.

05/05/2018 - 05:29

హైదరాబాద్, మే 4: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో పట్టుసాధించాలని భావిస్తున్న బీజేపీ తాజాపరిస్థితిని శనివారం నాడు నగరానికి వస్తు న్న కేంద్ర రహదారులు, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్, శాసనసభాపక్ష నాయకుడు కిషన్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు రామచంద్రరావు, శాసనసభాపక్షం ఉప నాయకుడు రామచంద్రారెడ్డితో భేటీ అవుతారు.

05/05/2018 - 05:26

హైదరాబాద్, మే 4: రాజధానిలో గాలివాన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. అకాల వర్షం సృష్టించిన బీభత్సానికి హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, భీకర ఈదురుగాలులు, వర్షానికి పలు చోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.

05/05/2018 - 05:22

హైదరాబాద్, మే 4: వేసవిలో నెలకొన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ గమ్యస్ధానాలకు 46 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. కాకినాడ టౌన్-తిరుపతి-కాకినాడ టౌన్ మధ్య 30 సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించింది.

05/04/2018 - 05:28

హైదరాబాద్, మే 3: రెండో రోజూ గురువారం నాడు ఎమ్సెట్ అగ్రికల్చర్ స్ట్రీం ఆన్‌లైన్ పరీక్షకు సాంకేతిక అవరోధాలు తప్పలేదు. కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా మొదలైనట్టు సమాచారం. అయితే సకాలంలో ఏర్పాట్లు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

05/04/2018 - 05:27

హైదరాబాద్, మే 3: కౌలు రైతులకు సైతం రైతుబంధు పథకం కింద సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రైతు సంఘాల నాయకులు పశ్యపద్మ, విస్సాకిరణ్, సాగర్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

05/04/2018 - 05:25

హైదరాబాద్, మే 3: తెలంగాణలోని గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కొత్తగా పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

05/04/2018 - 05:23

హైదరాబాద్, మే 3: తాము బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి రూ.3,79,470 మొత్తాన్ని దోచేశారు. బెంగాల్‌కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లు ఈ మొత్తాన్ని కాజేయగా, వారిని సిసిఎస్ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

05/04/2018 - 05:22

హైదరాబాద్, మే 3: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న హౌసింగ్ బోర్డుకు చెందిన 20 ఎకరాల భూమి సంబంధిత బోర్డుకే దక్కుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో రెండు దశాబ్దాలుగా న్యాయస్థానంలో ఇటు బోర్డు, అటు భూమి తనదేనంటూ అజమున్నీసాల మధ్య న్యాయపోరాటం జరిగింది. భూ వ్యవహారానికి సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాదించిందని అధికారులు పేర్కొన్నారు.

05/04/2018 - 05:19

హైదరాబాద్, మే 3: అకాల వర్షాలపై ప్రభుత్వం హైఅలర్టు ప్రకటించింది. తక్షణం నష్టాలను అంచనా వేయడానికి అధికారుల బృందాన్ని పంపాలని ప్రభుత్వం కలెక్టర్లును హెచ్చరించింది. ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు జరిగిన నష్టాలపై విడివిడిగా నివేదికలను పంపాలని ఉన్నతాధికారులు వౌలిక ఆదేశాలు జారీ చేశారు.

Pages