S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/11/2018 - 06:05

హైదరాబాద్, మే 10: తెలంగాణలోని వివిధ పీజీ, యుజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు ఈసారి దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. ఇసెట్‌కు మినహా మిగిలిన అన్ని ప్రవేశపరీక్షలకూ దరఖాస్తులు తక్కువగానే వచ్చాయి. గత ఏడాది మొత్తం ప్రధాన ప్రవేశపరీక్షలకు 4,56,990 దరఖాస్తులు రాగా, ఈసారి ఆ ప్రవేశపరీక్షలకు 4,00,953 దరఖాస్తులు వచ్చాయి.

05/11/2018 - 06:04

హైదరాబాద్, మే 10: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో యుజి కోర్సుల కౌనె్సలింగ్ ఈ నెల 28న ప్రారంభం కానుంది. గత వారం జరిగిన ఆన్‌లైన్ పరీక్షల ఫలితాలను ఈ నెల 18న ప్రకటించనున్నారు. అనంతరం రెండు రోజుల్లో ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకునే వీలుకల్పిస్తారు. మూడోవారంలో అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసి నెలాఖరు నుండి కౌనె్సలింగ్ ప్రారంభిస్తారు. ఈసారి కౌనె్సలింగ్ సైతం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.

05/11/2018 - 06:03

హైదరాబాద్, మే 10: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని రైతు సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం అవుతున్నాయి. కంటి తడుపు చర్యలతో వ్యవసాయాన్ని ఎన్నటికీ బాగు చేయలేమని, జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని అమలు చేయడం ద్వారానే వ్యవసాయదారులు సంతోషంగా జీవించగలుగుతారని రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్ పేర్కొన్నారు.

05/11/2018 - 06:01

హైదరాబాద్, మే 10: రైళ్ల రాకపోకల సమయపాలనలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గణనీయంగా మెరుగుదల సాధించింది. గత కొనే్నళ్ల నుంచి పోల్చి చూస్తే ఇటు సాంకేతికంగా, అటు శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాల వల్ల సమయపాలన మెరుగుపడి మంచి ఫలితాలు వస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇటీవల ద.మ.రై జిఎం వినోద్‌కుమార్ యాదవ్ సమయపాలన పట్ల అత్యధిక శ్రద్ద తీసుకోవాలని డిఆర్‌ఎంలు అందరికీ సూచించిన సంగతి తెలిసిందే.

05/11/2018 - 06:00

హైదరాబాద్, మే 10: తెలంగాణ ఆర్టీసిలో సమ్మెకు దిగేందుకు కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఈనెల 24 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని గురువారం ఆర్టీసీ ఎండి జివి రమణారావుకు ఏడు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందించారు. కాగా ఆర్టీసి గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయు) ఈ నెల 7వ తేదీనే సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

05/09/2018 - 05:29

హైదరాబాద్, మే 8: సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సెట్ ఫలితాలను సంస్థ కన్వీనర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. మొత్తం 61,580 మంది బాలురు, 55,205 మంది బాలికలు పరీక్షలకు హాజరయ్యారు. ఎస్సీలు 38,454 మంది, ఎస్టీలు 24612 మంది, బీసీలు 59,412 మంది పరీక్ష రాశారని చెప్పారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 232 సంస్థలున్నాయని, అందులో 18,560 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

05/09/2018 - 05:27

హైదరాబాద్, మే 8: ‘రేవంత్ అనే నేను.. ఒక నాయకుడిని, ముఖ్యమంత్రి కావడమే నా లక్ష్యం, చెప్పింది చేయ ను, నాకు నచ్చిందే చేస్తా..’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా హాలులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తూర్పార బట్టారు. అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అనేక సంచలన వ్యాఖ్యలు చేశా రు.

05/09/2018 - 05:28

ఉప్పల్, మే 8: హైదరాబాద్ ఉప్పల్‌లో సోమవారం జరిగిన ఐపీల్ మ్యాచ్‌కు సంబంధించిన క్రికెట్ టిక్కెట్లలో మోసానికి పాల్పడుతున్న యాంటీ అంబుష్ టీం ఉద్యోగిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. అక్కడ ఉద్యోగిగా ఉంటూ నాలుగు కాసులు సంపాధించాలన్న ఆశతో తన చేతివాటాన్ని ప్రదర్శించబోయి పోలీసులకు దొరికిపోయాడు.

05/09/2018 - 05:23

హైదరాబాద్, మే 8: తెలంగాణ వచ్చిన తరువాత ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆనందంగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గత మూడు రోజులుగా నిర్వహించిన కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. రాబోయే ఎన్నికల సన్నద్ధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు.

05/09/2018 - 05:21

హైదరాబాద్, మే 8: ‘్భరతదేశం వ్యవసాయంపై ఆధారపడ్డ దేశం, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టవుతుంది’ అన్నారు తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన 55 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ (రాజేంద్రనగర్) లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ అండ్ పిఆర్) లో మంగళవారం శిక్షణ ఇచ్చారు.

Pages