S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/25/2018 - 02:10

హైదరాబాద్, ఏప్రిల్ 24: కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామి విధానాలు, నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీలో ‘అక్రోశ్’ పేరిట కాంగ్రెస్ పార్టీ ఈ నెల 29న పెద్ద ఎత్తున ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహింనున్నది.

04/25/2018 - 02:07

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’ పథకంలో భాగంగా గ్రామాల పేర్లు, రైతుల పేర్లతో కూడిన తుది జాబితాను వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి మంగళవా రం నాడు బ్యాంకర్లకు అందచేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన గ్రామాలు, రైతుల పేర్లతో ఉన్న జాబితాను బ్యాంకర్లకు ఈ సందర్భంగా అందించారు.

04/25/2018 - 02:06

హైదరాబాద్, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంకేళ్లు వేసినా, ధర్నా చౌక్ ఎత్తివేసినా గవర్నర్ నరసింహన్ పట్టించుకోవడం లేదని ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు విమర్శించారు. గవర్నర్ మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

04/25/2018 - 02:06

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) పై భారీ ఆశలు పెట్టుకున్న పేద బ్రాహ్మణులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పేద బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఈ పరిషత్ ప్రకటించింది.

04/25/2018 - 01:14

హైదరాబాద్, ఏప్రిల్ 24: సీపీఎం 22వ జాతీయ మహాసభలు బీజేపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టించాయని సీపీఎం పార్టీ పొలిట్‌బ్యూరో స భ్యుడు రాఘవులు పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 18 నుంచి 22 వరకు నిర్వహించిన సభలు విజయవంతం అయ్యాయని వివరించారు.

04/25/2018 - 01:13

హైదరాబాద్, ఏప్రిల్ 24: ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు జివి సూర్య కిరణ్ (సూర్య) కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. బుధవారం ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌ను పార్టీ పెట్టాల్సిందిగా గద్దర్ వత్తిడి తెచ్చారు.

04/25/2018 - 01:11

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాల వాస్తవ జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు 4 ఏక సభ్య కమిటీలను ఏర్పాటు చేసినట్టు బీసీ కమిషనర్ చైర్మన్ రాములు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి, వారి నివాస ప్రాంతాలను, సామాజిక, జీవన స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలిస్తాయని చెప్పారు.

04/25/2018 - 01:10

హైదరాబాద్, ఏప్రిల్ 24: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ బీజేపీ నాయకులకు హితవుపలికారు. మంగళవా రం సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/25/2018 - 01:10

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మే 4వ తేదీన ఆర్టీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలను ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

04/24/2018 - 04:18

సూర్యాపేట, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో జరిగిన అభివృద్దిపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పధకాలను చూసి ప్రజల్లో విశ్వాసం కోల్పోతామనే భయంతో విమర్శలు చేస్తున్న విపక్ష నాయకులకు దమ్ముంటే చర్చకు సిద్దం కావాలని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్దిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

Pages