S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/04/2018 - 04:16

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 3: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానం 2017-18 వార్షిక ఆదాయ, వ్యయాలను మంగళవారం వెల్లడించారు. 93కోట్ల 96 లక్షల 91వేల 769 రూపాయల ఆదాయం లభించగా, వ్యయం 93కోట్ల 31లక్షల 2వేల 400 రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వార్షిక ఆదాయం 43 లక్షల 48వేల 235 రూపాయలు పెరగగా, వ్యయంలో 5కోట్ల 49లక్షల 42వేల 197 రూపాయల తగ్గుదల ఉండటం గమనార్హం.

04/04/2018 - 04:15

భువనగిరి, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ, అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్న దళిత ఆందోళనకారులపై దుర్మార్గంగా కాల్పులు జరపడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని మాజీ ఎంపీ బృందాకారత్ అన్నారు.

04/04/2018 - 03:48

మల్యాల, ఏప్రిల్ 3: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవ పనుల పూర్తితో రాష్ట్రంలో 12.45లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంసాగర్‌లో నిర్మిస్తున్న పంప్‌హౌస్ పనుల పరోగతిని మంత్రి మంగళవారం పరిశీలించారు.

04/04/2018 - 03:34

కరీంనగర్, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ మనసులో ఉందని, కానీ ధైర్యం చేయలేకనే సుప్రీంకోర్టు సవరణలు చేసేలా చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హయాం లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పార్లమెంటులో మేధోమదనం జరిగిన తరువాతే ఆ చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు.

04/04/2018 - 03:50

సూర్యాపేట, ఏప్రిల్ 3: ఉమ్మడి రాష్ట్రంలో ఐదు దశాబ్దాలుగా జరగని అభివృద్ధిని తెలంగాణ ఏర్పాటు తర్వాత గడిచిన నాలుగేళ్లలోనే చేసి చూపించామని, దీంతో సూర్యాపేట నియోజకవర్గం ప్రగతిబాటన పయనిస్తుండగా తమకు ఉనికి ఉండదనే భయంతో ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

04/04/2018 - 03:27

నలభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నీళ్లిచ్చారా?: మంత్రి ఈటల

04/04/2018 - 03:26

కొత్తగూడెం, ఏప్రిల్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

04/04/2018 - 03:52

వరంగల్, ఏప్రిల్ 3: తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీయేనని, అలాగే అన్నీ కాంగ్రెస్ పార్టీ పథకాలనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

04/04/2018 - 03:22

సంగారెడ్డి, ఏప్రిల్ 3: పదేళ్లు అధికారంలో ఉండి దోపిడీకి పాల్పడిన కాంగ్రెస్ నేతలు మరోసారి ప్రజలను తప్పుదారి పట్టించి అధికారంలోకి రావడానికి బస్సు యాత్ర పేరిట బయలుదేరారని పశు సంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ నాయకులు తలకిందులుగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎగతాళి చేసారు.

04/04/2018 - 02:35

హైదరాబాద్, ఏప్రిల్ 3: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, శాస్తవ్రేత్త, విద్యావేత్త ప్రొఫెసర్ టి శివాజీరావు పేరును రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శాస్త్ర విజ్ఞాన సంస్థకు నామకరణం చేయాలని మంగళవారం నాడిక్కడ జరిగిన శివాజీరావు సంతాప సభలో పలువురు డిమాండ్ చేశారు.

Pages