S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

04/25/2017 - 22:46

పశ్చిమాఫ్రికాలో పిల్లలే మిలిటెంట్ల పావులు ఆత్మాహుతి బాంబర్లుగా ప్రయోగం
ఫలించని యునిసెఫ్ ప్రయత్నాలు అంతర్యుద్ధంతో లక్షలాదిమంది నిరాశ్రయులు

04/25/2017 - 22:43

అక్రమ వలసలను అరికట్టడంలో రాజీ లేదంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపక్ష డెమోక్రాట్లతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆయన తాను సిద్ధమంటున్నారు. ముఖ్యంగా మెక్సికోనుంచే ఈ రకమైన వలసల ప్రభావం అత్యధికంగా ఉండటం వల్ల రెండు దేశాల మధ్య సరిహద్దును నిర్మించే వరకూ తాను విశ్రమించేది లేదన్న బలమైన సంకేతాలను ట్రంప్ అందించారు.

04/25/2017 - 22:41

ఫ్రాన్స్ రాజకీయాల్లో ఇదో చారిత్రక ఘటం. సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికారు. తొలి రౌండ్‌లో విజేతలుగా నిలిచిన ఐరోపా అనుకూల ఇమాన్యుయెల్ మాక్రన్, ఇమిగ్రేషన్ వ్యతిరేక లీపెన్‌లు మే 7న తుదిపోరుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరిదీ భిన్నమైన ఆలోచనలు, విధానాలే!లీ పెన్ గెలిస్తే మరో లేడీ ట్రంప్‌కు ఫ్రాన్స్ పగ్గాలు అప్పగించినట్టే అవుతుందన్న భావన ఇప్పటికే బలంగా ఉంది.

04/25/2017 - 22:38

సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుతూ ఇటు అమెరికాను, అటు భారత్‌ను తన చర్యల ద్వారా కవ్విస్తూ చైనా మరింతగా తన ఆధిపత్యాన్ని విస్తరించుకుంటోంది. అన్నివిధాలుగా దేశంపై పట్టు బిగించిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైన్యాన్ని సర్వసన్నద్ధం కావాలంటూ తాజాగా ఇచ్చిన పిలుపు అనేక దేశాల్లో కలవరాన్ని రేపుతోంది.

04/11/2017 - 22:12

సిరియాపై జరిగిన రసాయన ఆయుధ దాడి ఇటు అమెరికా అటు రష్యాల మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణలకు ఆజ్యం పోస్తోంది. దశాబ్దాలుగా అంతర్వుద్ధంలో అట్టుడుకుతున్న సిరియాను రష్యా వెనకేసుకురావడం, తాజా ఘటన నేపథ్యంలోనూ బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో అమెరికా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

04/11/2017 - 21:58

సిరియాపై జరిగిన రసాయనిక ఆయుధదాడి అక్కడి ప్రజల ప్రాణాలను క్షణాల్లో తీసేసింది. నురగలు కక్కుతూ అచేతనావస్థలో చిన్నారులు ఆసుపత్రి పాలు కావడం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. ప్రత్యర్థి వర్గాలపై అసాద్ అనుకూల దళాలు జరిపిన దాడి కారణంగానే ఈ అమానుషం సంభవించినట్టుగా స్పష్టమవుతోంది. చిన్నారులను మోసుకుని తీసుకెళుతున్న సహాయదళ సిబ్బంది.

04/11/2017 - 21:56

అమెరికా మరోసారి రెండు యుద్ధాలకు పరిమిత స్థాయిలో సిద్ధమవుతోందా? 9/11 నేపథ్యంలో అటు ఇరాక్‌పైనా, ఇటు అఫ్గాన్‌పైనా సమర భేరి మోగించిన అమెరికా ఇప్పుడు సిరియాపై దృష్టి పెట్టింది..అదే సమయంలో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాపైనా యుద్ధ నౌకల్ని గురి పెడుతున్నట్టుగా తాజా పరిణామాల్ని బట్టి స్పష్టం అవుతోంది.

04/11/2017 - 21:53

అమెరికా క్షిపణి వర్షం దృశ్యం ఇది. సిరియాలోని తిరుగుబాటు దారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఈ దాడికి పాల్పడింది. దీన్ని తీవ్రస్థాయలో రష్యా ప్రతిఘటించింది. ఈ దాడిలో అనేకమంది చిన్నారులు కూడా మరణించడం సర్వత్రా అమెరికా చర్య పట్ల నిరసనలకు ఆజ్యం పోసింది.

04/11/2017 - 21:51

అమానుష రీతిలో ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా, సంబంధం ఉన్నాలేకపోయినా ఉత్సాహంగా ముందుకొచ్చి తన బలాన్ని ప్రదర్శించడం అన్నది అమెరికాకు ఆనవాయితీగా మారింది. ప్రజాస్వామ్య హక్కుల పేరిట, మానవత్వ రక్షణ పేరిట ఈ రకమైన చర్యలు చేపట్టని చరిత్ర అమెరికాకు ఎంతో ఉంది.

04/11/2017 - 21:50

ప్రపంచంలో అనేక దేశాల్లో అంతర్యుద్ధాలను చూశాం. సిరియా తరహాలో జరిగిన యుద్ధాలు చాలా తక్కువే. ఈ యుద్ధకాండ అడ్డూ అదుపూ లేకుండా సాగడానికి ప్రధాన కారణం..సిరియా అధ్యక్షుడు అసాద్‌ను రష్యా వెనకేసుకు రావడం.. ఆయన ప్రత్యర్థులను అమెరికా ఎగదోయడమే!

Pages