S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 04:34

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 19: అశ్విన్ స్పిన్ మాయకు ఎంతటి సమర్థులైనా చిత్తుకాక తప్పదని మరోసారి రుజువైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలోనూ అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. అతను మొత్తం ఐదు వికెట్లు సాధించడంతో, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కుప్పకూలింది.

11/20/2016 - 04:32

చిత్రం.. ముఖ్యమంత్రి పాల్గొన్న డ్వాక్రా సదస్సును ట్యాబ్‌ల ద్వారా చిత్రీకరిస్తున్న వెలుగు సిబ్బంది

11/20/2016 - 04:29

రాజమహేంద్రవరం, నవంబర్ 19: ‘పెద్ద నోట్ల రద్దును నేను సమర్ధించాను..అయితే ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురైనట్టు భావిస్తున్నా. ఇందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని ప్రత్యామ్నాయాలను అనే్వషించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో శనివారం నిర్వహించిన జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు.

11/20/2016 - 04:22

సింహాచలం, నవంబర్ 19: తెలుగు రాష్ట్రాలు రెండూ సుభిక్షంగా ఉండాలని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని కోరుకున్నట్టు ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎల్‌ఎస్ నరసింహన్ చెప్పారు. శనివారం ఆయన సింహాచలేశుని దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలసిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని ఆయన అన్నారు.

11/20/2016 - 04:18

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణలో ఉన్నత విద్యా రంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ ఏడాది ఫలితాలు కనీసం 10 శాతం పెరగాలని ఆయన పేర్కొన్నారు.

11/20/2016 - 04:14

చెన్నై, నవంబర్ 19: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరో గ్యం పూర్తిగా కుదుటపడింది. దాదాపు రెండు నెలలుగా చెన్నై అపోలో ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్న జయలలిత శనివారం ప్రైవేటు గదికి మారారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సి.ఆర్. సరస్వతి విలేఖరులకు చెప్పారు. ‘మేం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి వార్డుకు బదిలీ అయ్యారు.

11/20/2016 - 04:11

విజయవాడ (క్రైం), నవంబర్ 19: రాష్ట్ర అభివృద్ధికి అవినీతి అవరోధం కాకూడదని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డిజిపి ఆర్‌పి ఠాకూర్ అన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అవినీతిని నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్ర ఏసిబి డిజిపిగా ఆయన శనివారం బాధ్యతలు చేపట్టారు.

11/20/2016 - 04:09

న్యూఢిల్లీ, నవంబర్ 19:శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు నిర్మాణాన్ని పిపిపి పద్ధతిలో చేపట్టవద్దని కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు.

11/20/2016 - 04:09

హైదరాబాద్, నవంబర్ 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పిహెచ్‌డి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. దీంతో యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య వివాదం రాజుకుంది. యూనివర్శిటీ విద్యార్థులు గచ్చిబౌలిలోని యూనివర్శిటీ పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు.

11/20/2016 - 04:08

తిరుపతి, నవంబర్ 19: దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేసిన నేపధ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ తగ్గినా వెంకన్న ఆదాయం మాత్రం గత ఏడాది కన్నా ఈసారి రూ.7కోట్లు పెరిగింది. ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానులక ద్వారా రూ.29.12 కోట్లుగా లెక్కతేలింది.

Pages