S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 03:34

హైదరాబాద్, నవంబర్ 19: చర్లపల్లి కేంద్ర కారాగారంలో దీపక్ అనే రిమాండ్ ఖైదీ టవల్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చోరీ కేసులో అతను గత ఫిబ్రవరి నెల నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం దీపక్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు జైలు అధికారి వెంకటరెడ్డి తెలిపారు.

11/20/2016 - 03:34

హైదరాబాద్, నవంబర్ 19: విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించకపోతే ఈ నెలాఖరున జరిగే సిఎం నూతన క్యాంపుకార్యాలయ గృహ ప్రవేశాన్ని వేలాది విద్యార్థులతో అడ్డుకుంటామని టిఎన్‌ఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు 2090 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

11/20/2016 - 03:20

రాజమహేంద్రవరం, నవంబర్ 19: పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను మోసిన సీనియర్ కార్యకర్తలకు, పాపులారిటీ కలిగినవారికే నామినేటెడ్ పదవులు ఇస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

11/20/2016 - 03:17

శ్రీకాకుళం, నవంబర్ 19: ఒడిశాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలన్నీ భయం గుప్పెట్లో అల్లాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు పల్లెల్లో మావోల ప్రతీకారేచ్ఛ రగులుకుంది. కోరాపుట్ జిల్లా సిమిలిగూడ సమితి పరిధిలోని బితోరోకోట వద్ద రహదారి నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదు వాహనాలను దగ్ధం చేశారు.

11/20/2016 - 03:15

రాజమహేంద్రవరం, నవంబర్ 19: రాష్టవ్య్రాప్తంగా ఉన్న సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలకు దివంగత లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం సాయంత్రం మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన మహాగర్జన సభ జరిగింది.

11/20/2016 - 03:12

తాడేపల్లిగూడెం, నవంబర్ 19: ఫసలీ బీమా యోజన సహా పలు పథకాలు ప్రవేశపెట్టిన తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని చాటిచెప్పడానికే ఈ నెల 26న లక్షమంది రైతులతో ‘రైతుసభ’ నిర్వహిస్తున్నామని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ సభలో పాల్గొని రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరిస్తారన్నారు.

11/20/2016 - 03:07

గుంటూరు, నవంబర్ 19: రాజధాని ప్రాంతంలో ఏ నిర్మాణాలకైనా ప్లాన్ల కోసం ఆన్‌లైన్‌లో తమకు దరఖాస్తులు చేసుకోవాలని సీఆర్డీయే నిబంధన విధించటం పట్ల సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీయే నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్ ఉండి ప్లాన్‌కు అనుమతి మంజూరు చేస్తే తప్ప భూముల లావాదేవీలు, నిర్మాణాలు జరగరాదని ఆంక్షలు విధించింది.

11/20/2016 - 03:05

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మరోసారి పెద్ద పీట వేసింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, శిశువులకు పౌష్ఠికాహారం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 55,581 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో లక్షా 4వేల మందికి పైగా అంగన్‌వాడీ వర్కర్లు పని చేస్తున్నారు. 2016-17 రాష్ట్ర బడ్జెట్‌లో స్ర్తి, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ 1331.73 కోట్లు కేటాయించింది.

11/20/2016 - 03:05

హిందూపురం/పరిగి, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఆ చిరు వ్యాపారి ప్రాణాలమీదికి తెచ్చింది. సరుకులు కొనుగోలుకు వచ్చిన వారు ఇచ్చిన పెద్దనోటు తిరస్కరించడంతో వారు కక్షగట్టి ఆ చిరువ్యాపారిపై బేడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చేరాడు. అనంతపురం జిల్లా పరిగి మండలం కోనాపురంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

11/20/2016 - 03:04

గుంటూరు, నవంబర్ 19: రాజధాని అమరావతిలో లంక భూముల సమీకరణ వివాదాస్పదంగా మారుతోంది. కోర్ కేపిటల్‌కు నిర్దేశించిన లింగాయపాలెంలో 200 ఎకరాల లంక భూములను రాజధాని అవసరాలకు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని సమీకరించడం తగదని దళిత సంఘాల ఆధ్వర్యంలో రైతులు వ్యతిరేకించారు. నష్టపరిహారం ప్యాకేజీ తమకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

Pages