S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 07:31

అనంతపురం అర్బన్, నవంబర్ 19:తుంగభద్ర ఎగువ కాలువ కింది ఆయకట్టుకు నీరు విడుదల కోసం శనివారం రైతులు, వైకాపా, వామపక్షాల నాయకులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హెచ్చెల్సీ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలు, తూములను రైతులే స్వచ్ఛందంగా ఎత్తివేయడానికి చర్యలు తీసుకోగా పోలీసులు అడ్డుకుని అరెస్టుచేశారు.

11/20/2016 - 07:30

విజయవాడ, నవంబర్ 19: కార్పొరేట్ వర్గాలకు ముందుగానే లీక్ చేసి సామాన్యులను ముప్పు తిప్పలు పెట్టే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన కరెన్సీ సర్జికల్ దాడి 2019 ఎన్నికల్లో ఆయనను చెల్లని నోటుగా మార్చడం ఖాయమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ హెచ్చరించారు.

11/20/2016 - 07:29

విజయవాడ, నవంబర్ 19: రాయలసీమలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా పంటలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

11/20/2016 - 07:28

మచిలీపట్నం (కోనేరుసెంటరు), నవంబర్ 19: గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. శనివారం మండల పరిధిలోని మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, మేకావానిపాలెం, పోతిరెడ్డిపాలెం, కొత్తపూడి, పొట్లపాలెం, పోతేపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

11/20/2016 - 07:27

నాగాయలంక, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల కొరకు కృష్ణా జిల్లా దివిసీమ, తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాలు ప్రధాన భూమికను పోషిస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ శ్రీకాంత్ తెలిపారు. శనివారం స్థానిక శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్ వద్ద పర్యాటక అభివృద్ధిపై శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ఆయన చర్చించారు.

11/20/2016 - 07:26

మచిలీపట్నం, నవంబర్ 19: ఎవరెన్ని కుయుక్తులు పన్నినా బందరు ఓడరేవు, పారిశ్రామిక వాడ నిర్మాణాన్ని అడ్డుకోలేరని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావులు స్పష్టం చేశారు. మరో రెండు నెలల్లో పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించి రెండేళ్ళల్లో పూర్తి చేస్తామన్నారు. 2018 నాటికి బందరుకు ఓడను తీసుకువస్తామన్నారు.

11/20/2016 - 07:24

హైదరాబాద్, నవంబర్ 19: జలమండలి క్యాష్ కౌంటర్లలో నీటి బిల్లులు చెల్లించడానికి వినియోగదారులు ఆసక్తి కనపర్చడంతో ఇప్పటి వరకు జలమండలికి రికార్డు స్థాయిలో రూ.57.26 కోట్లు వసూళ్లు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్లతో నీటి బిల్లులు చెల్లించడానికి వినియోగదారులకు జలమండలి బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి 64 క్యాష్ కౌంటర్లను ఏర్పాటు చేసింది.

11/20/2016 - 07:23

షాబాద్, నవంబర్ 19: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం షాబాద్ మండల కేంద్రంలోని పిఆర్‌ఆర్ మినీ స్టేడియంలో షాబాద్ మండల మహిళా సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅథితిగా సునీతారెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య హజరయ్యారు.

11/20/2016 - 07:22

హైదరాబాద్, నవంబర్ 19: పెద్ద నోట్ల రద్దు, అశ్లీలత, మనోభావలను కించపరచే విధంగా కార్టూన్లపై సామాజిక మాద్యమాలలో వస్తున్న పోస్టింగ్‌లను వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొందరు ఆకతాయిలు చేస్తున్న ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రూ. 30 కోట్లతో సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశామని చెప్పారు.

11/20/2016 - 07:21

కాచిగూడ, నవంబర్ 19: నోట్ల రద్దును ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదన సరైంది కాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘కరెన్సీ సంక్షోభం గ్రామీణ ప్రజలపై వ్యవసాయ రంగంపై ప్రభావం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ రైతు సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.

Pages