S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 07:53

విజయనగరం, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు ఉద్దేశించిన ప్రజాసాధికార సర్వే జిల్లాలో అరకొరగా సాగుతొంది. 2011 జనాభాను ఆధారంగా చేసుకొని సిబ్బంది సర్వే చేపడుతుండటంతో ఈ సర్వే కూడా మొక్కుబడిగా సాగుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

11/20/2016 - 07:52

డుంబ్రిగుడ, నవంబర్ 19: డుంబ్రిగుడ మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో నిక్షిప్తమైన ఉన్న ఖనిజ సంపదను వెలకితీసేందుకు రెవెన్యూ అధికారులు రహస్య సర్వే చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు చేస్తున్న సర్వే అంశాన్ని తెలుసుకున్న గిరిజనులు అధికారులను నిలదీయడంతో వెనుదిరిగినట్టు సమాచారం.

11/20/2016 - 07:49

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 19: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గ్రంథాల వారోత్సవాలు శనివారం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిఫెడరిక్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు హాజరై మాట్లాడుతూ గ్రంథాలయాలకు సంబంధించిన అనేక ముఖ్యవిషయాలను తెలిపారు. గ్రంథాలయాలను వినియోగించుకుని ఉజ్వల భవిష్యత్‌ను పొందాలన్నారు.

11/20/2016 - 07:48

నెల్లూరు, నవంబర్ 19: త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ పదవులు పొందేందుకు జిల్లాకు చెందిన టిడిపి నేతలు ఇప్పట్నుంచే అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే అందివచ్చిన అవకాశంలా టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు ఎవరికి వారు తమ వంతు తీవ్రంగానే శ్రమించారు.

11/20/2016 - 07:46

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 19: నోట్ల రద్దుతో పెద్దవాళ్ళు ఏమోగాని చిన్న వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామాల నుండి ఖమ్మం నగరంలో పనిచేసే రోజు వారి కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఖమ్మం నగరానికి చుట్టు పక్కల గ్రామాల నుండి వేల మంది కూలీ పనులకు వచ్చి సాయంత్రం కాగానే వచ్చే కూలీతో ఇంటికి చేరి జీవనం సాగిస్తుంటారు.

11/20/2016 - 07:45

కర్నూలు, నవంబర్ 19:కళాశాలలో ర్యాగింగ్, చదువు పేరుతో ఒత్తిడి చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలేవీ విద్యార్థుల ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాయి. కార్పొరేట్ కళాశాలల్లో ర్యాగింగ్ లేకపోయినా ర్యాంకుల కోసం విద్యార్థుల మనసుపై దాడి చేస్తూ వారిని ఒత్తిడికి గురి చేయడం వల్లే దిక్కుతోచని స్థితిలో తమను తాము బలి చేసుకుంటున్నారు.

11/20/2016 - 07:41

గుంటూరు, నవంబర్ 19: ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా, స్పెషల్ సమ్మరి రివిజన్ తదితర అంశాలపై శనివారం కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ ఎస్ నాగలక్ష్మి సమావేశం నిర్వహించారు.

11/20/2016 - 07:40

రాజమహేంద్రవరం, నవంబర్ 19: తెలుగు తమ్ముళ్ల హడావిడి మధ్య రాజమహేంద్రవరంలో శనివారం సిఎం చంద్రబాబునాయుడు పర్యటన కోలాహలంగా సాగింది. నాలుగు బహిరంగ సభలు, ఆరు కార్యక్రమాలతో ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటన బిజీ బిజీగా సాగింది. నిర్దేశిత సమయానికి అటూ ఇటూగా ఉదయం 9.40 గంటలకు రాజమహేంద్రవరం చేరుకున్న చంద్రబాబునాయుడు రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు గడిపారు.

11/20/2016 - 07:36

తిరుపతి, నవంబర్ 19: చిత్తూరు జిల్లాలో ప్రజల సౌకర్యార్థం 5వేల ఈ పాస్ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీషా చెప్పారు. తిరుపతి డివిజన్‌లోని శ్రీ విద్యానికేతన్ కళాశాల, పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో విద్యార్థులతో నగదు రహిత లావాదేవీలపై అవగామన కార్యక్రమం నిర్వహించారు.

11/20/2016 - 07:36

కడప,నవంబర్ 19:పెద్దనోట్ల రద్దుతో జిల్లాలో పెద్దసంఖ్యలో లారీలు రోడ్డెక్కలేదు. ఫలితంగా రవాణా స్తంభించింది. రాష్ట్రంలో విజయవాడ తర్వాత అధికంగా లారీలు జిల్లాలో ఉన్నాయి. పదివేలు పైబడి లారీలు ,ఐదువేలు పైబడి బాడుగకు తిరిగే నాలుగు చక్రాలవాహనాలు నిలచిపోయాయి. ఈ వాహనాలు అధికసంఖ్యలో రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.

Pages