S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభివృద్ధికి అవినీతి అడ్డంకి కాకూడదు

విజయవాడ (క్రైం), నవంబర్ 19: రాష్ట్ర అభివృద్ధికి అవినీతి అవరోధం కాకూడదని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డిజిపి ఆర్‌పి ఠాకూర్ అన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అవినీతిని నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్ర ఏసిబి డిజిపిగా ఆయన శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసి ఎండిగా బదిలీ అయిన సీనియర్ ఐపిఎస్ అధికారి ఎం మాలకొండయ్య నుంచి బాధ్యతలు స్వీకరించిన ఠాకూర్ అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయని, అయితే అభివృద్ధికి అవినీతి అడ్డంకి కాకూడదని చెబుతూ ఇందుకుగాను ముందస్తు నియంత్రణ చర్యలు చేపడతామన్నారు. అవినీతిని ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని, అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అధికారులు లంచం అడగాలంటే భయపడేలా ఏసిబిని పటిష్ఠం చేస్తామన్నారు. టోల్‌ఫ్రీ, సోషల్ మీడియా, మొబైల్ సమాచారం ద్వారా టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటామని చెప్పారు. ఏసిబిలో లీగల్ సిస్టంను పటిష్ఠం చేయడం ద్వారా నిందితులకు కోర్టుల్లో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కేసుల్లో నిందితులపై నేరం రుజువై కోర్టుల్లో శిక్షలు పడేవరకు వేచి చూడకుండా అరెస్టు చేసిన సమయంలోనే అవినీతికి పాల్పడిన వారి ఆస్తులను సీజ్ చేసే అంశంపై చట్టంలో మార్పులు తీసుకువచ్చేందుకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇదిలావుండగా.. ఏసిబిలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని, ఈ అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. విలేఖరుల సమావేశంలో ఏసిబి అసిస్టెంట్ డైరెక్టర్ అబ్రహాం లింకన్, జాయింట్ డైరెక్టర్ డి నాగేంద్రకుమార్ ఇతర ఏసిబి అధికారులు పాల్గొన్నారు.