S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 02:29

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్ద నోట్లను రద్దు చేసి పది రోజులు గడిచి పోయిన తర్వాత బ్యాంకుల వద్ద కాస్త రద్దీ తగ్గినప్పటికీ ఎటిఎంల వద్ద మాత్రం రద్దీ పెరిగింది. రద్దయిన నోట్లను మార్చుకోవడంపై కొన్ని పరిమితులు విధించిన తర్వాత బ్యాంకుల వద్ద క్యూలు తగ్గిపోయాయి కానీ వారాంతం కావడంతో ఎటిఎంల వద్ద మాత్రం రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

11/20/2016 - 02:27

న్యూఢిల్లీ, నవంబర్ 19: ముంబయిలోని నిషిద్ధ స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్)కు సంబంధించిన పది కార్యాలయాలపై శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు నిర్వహించింది. ఐఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు జాకీర్ నాయక్ తదితరులపై శుక్రవారం రాత్రి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదయిన నేపథ్యంలో స్థానిక పోలీసుల సహకారంతో ఎన్‌ఐఎ ఈ సోదాలు నిర్వహించింది.

11/20/2016 - 02:25

పెనుకొండ, నవంబర్ 19: న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు పై కోర్టులు తప్పుపట్టే విధంగా ఉండరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. శనివారం జరిగిన అనంతపురం జిల్లా పెనుకొండలోని మున్సిఫ్ కోర్టు 144వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో న్యాయవాదుల పని ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. నేటి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు.

11/20/2016 - 02:23

అమరావతి, నవంబర్ 19: వారిద్దరిదీ మంచి జోడీ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తరచూ కీర్తిస్తుంటారు. పని తప్ప వాళ్లిద్దరికీ వేరే పనిలేదని ఛలోక్తులు విసురుతుంటారు. వారిద్దరి హయాంలోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేస్తుంటారు. ప్రజలు వారిద్దరినీ గుండెల్లో పెట్టుకున్నారని కితాబిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ జోడీపై సామాన్య జనంలో విమర్శల దాడి పెరుగుతోంది. కష్టపడి సాధించుకున్న ఇమేజీ డామేజీ అవుతోంది.

11/20/2016 - 02:13

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కొత్త రాష్టమ్రైన తెలంగాణకు పెద్ద కుదుపు. రాష్ట్రానికి దండిగా ఆదాయాన్నించే రంగాలు కుదేలయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కేంద్రం చేయూతనివ్వడం ఒక్కటే మార్గం. ఈ విషయంలో కేంద్రం ఒకడుగు ముందుకేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీకి వివరించినట్టు తెలుస్తోంది.

11/20/2016 - 02:10

హైదరాబాద్, నవంబర్ 19: ఆసక్తిగల రంగాల్లో ప్రగతి భాగస్వామ్యంతో అడుగులేద్దామని మారిషస్ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్‌కు తెలంగాణ ఐటీ మంత్రి కె తారక రామారావు ప్రతిపాదించారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య వారధిగా వ్యవహరిస్తున్న టాస్క్ ప్రగతికి భాగస్వామ్య సహకారం అందించాలని కోరారు. శనివారం ముంబయిలో మారిషస్ ప్రధాని అనిరుథ్ జగన్నాథ్‌తో సమావేశమయ్యారు.

11/20/2016 - 02:08

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. చాలా జిల్లాల్లో రాత్రివేళ కనీస ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. చాలా జిల్లాల్లో గత రాత్రి కనీస ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లాలో కనీస ఉష్టోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్‌లో 13 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

11/20/2016 - 02:07

కొత్తకోట, నవంబర్19: వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోని అమడబాకుల స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భక్తులు మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన మరో భక్తుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. శనివారం ఉదయం మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఎపి 24 ఎజె 5111 అనే నెంబర్‌గల స్కార్పియో వాహనం ప్రమాదానికి గురైంది.

11/20/2016 - 01:58

న్యూఢిల్లీ, నవంబర్ 19: కేంద్రం అనుకున్నంత పని చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కలుగుల్లో దాచిన ధనాన్నంతా బ్యాంకులకు రప్పించిన సర్కారు ఇప్పుడు అధికమొత్తాల్లో డిపాజిట్లు చేసిన వారికి చెక్ పెట్టడం మొదలు పెట్టింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.

11/20/2016 - 01:52

కోడుమూరు, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని పార్లమెంటులో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు. శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించిన రైతు సదస్సు, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలకు హాజరైన ఖర్గే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు.

Pages