S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పనిచేసే వారికే పట్టం కడతా

రాజమహేంద్రవరం, నవంబర్ 19: పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను మోసిన సీనియర్ కార్యకర్తలకు, పాపులారిటీ కలిగినవారికే నామినేటెడ్ పదవులు ఇస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పదవులకు సీనియారిటీ ఒకటే సరిపోదని, పాపులారిటీ కూడా అవసరమని, అటువంటి వారినే నామినేటెడ్ పదవులు వరిస్తాయన్నారు. పార్టీ అంటే ఒక కుటుంబం మాదిరిగా అభివృద్ధి చెందాలన్నారు. 54లక్షల మంది సభ్యత్వం ద్వారా సమకూరిన నగదును సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. కార్యకర్తల గౌరవ, ప్రతిష్ఠలు పెంచే పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒకటేనన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పెద్ద ఆస్తి అన్నారు. కష్టనష్టాలకు ఓర్చి జెండా మోస్తున్న కార్యకర్తలే శ్రీరామరక్ష అన్నారు. కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నామన్నారు. మంచిచేస్తే ప్రజలెపుడూ మన వెంటే ఉంటారని గుర్తించాలన్నారు. ఎన్నికల మేనిఫేస్టోను కచ్చితంగా అమలుచేస్తున్నామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్రాన్ని రక్షించిందన్నారు. దీనిద్వారా ఇప్పటివరకు 50 టిఎంసిలు గోదావరి వృథాజలాలను వినియోగించుకున్నామన్నారు. పోలవరాన్ని పూర్తిచేసి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రతీ ఎకరాకూ నీరిస్తామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల ఇళ్ళకు శ్రీకారం చుట్టామన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత టీడీపీదేనన్నారు. కొంత మంది మతాన్ని, మరి కొంత మంది ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించారని, ఆఖరికి కులాన్ని అడ్డుపెట్టుకుని చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబునాయుడు అన్నారు. సామాజిక న్యాయం టిడిపిలోనే జరిగిందన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. బలహీనమైన నాయకత్వం ఉన్నచోటే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఆధునిక టెక్నాలజీ వల్ల 95 శాతం శాంతి భద్రతలను అదుపుచేయగలుగుతున్నామన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పనిచేస్తున్నానన్నారు. సమాజంపై కమిట్‌మెంట్‌తో టిడిపి నవ సూత్రాలు అమలు చేస్తుందన్నారు. ఆరు కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లు వున్నాయని వీటిని ఎన్‌పిసిఎ కు అనుసంధానం చేస్తామన్నారు. ఇంకా 9 లక్షల మంది జన్‌ధన్ అకౌంట్లు తీసుకోవాల్సి వుందన్నారు. త్వరలో బ్రాందీ షాపుల్లో కూడా స్వైప్ కార్డు వినియోగంలోకి రానుందని ప్రకటించడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్ ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు.

చిత్రం.. రాజమహేంద్రవరంలో చంద్రబాబు పాదయాత్ర