S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 02:43

న్యూఢిల్లీ, నవంబర్ 19: కొత్త 2 వేల రూపాయలు, 500 రూపాయల డిజైన్‌లో దేవనాగరి లిపిని ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బినయ్ విశ్వమ్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నోట్ల డిజైన్‌లో దేవనాగరి లిపిని ఉపయోగించడం అధికార భాషలకు సంబంధించిన రాజ్యాంగంలోని 343(ఎ) అధికరణానికి విరుద్ధమని పేర్కొంటూ ఆయన శుక్రవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు.

11/20/2016 - 02:42

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్రానికి తెలిపినట్టు మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ వెల్లడించారు. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి శివాజీ హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

11/20/2016 - 02:42

ముంబయి, నవంబర్ 19: మహారాష్టల్రో అరవై ఏళ్ల పూజారి చితిపై పడుకుని తనకు తానే నిప్పంటించుకుని మృతి చెందారు. హింగోలీ జిల్లా సుయేగావ్ గ్రామంలో శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో విఠల్ పోలే పూజారిగా ఉన్నారు.

11/20/2016 - 02:41

న్యూఢిల్లీ, నవంబర్ 19: సాంఘిక సంక్షేమ రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యుక్తులు, సంస్థలకు రాష్టప్రతి ప్రణబ్ శనివారం ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) అవార్డులను ప్రదానం చేశారు. మొక్కల పెంపకం, రక్తదానం, సామాజిక చైతన్య శిబిరాల నిర్వహణ లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది.

11/20/2016 - 02:41

హ్యూస్టన్, నవంబర్ 19: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కృత్రిమ గుండె ఆపరేషన్ చేసిన డెంటాన్ కూలే (96) శనివారం కన్నుమూశారు. అమెరికాకు చెందిన కూలే టెక్సాస్‌లో హార్ట్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించారు. కార్డియోవ్యాస్కులర్ సర్జరీలో ఇప్పటికీ ఆయన వినియోగించిన టెక్నిక్‌నే వాడుతున్నారు. కూలే తన బృందంతో కలిసి 1,18,000 గుండె ఆపరేషన్లు చేశారు.

11/20/2016 - 02:40

న్యూయార్క్, నవంబర్ 19: మరణశిక్షపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేస్తూ ఐక్యరాజ్య సమితి రూపొందించిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ తీర్మానం భారతీయ చట్టాలతోపాటు సొంత న్యాయ వ్యవస్థ ఏవిధంగా ఉండాలనే విషయాన్ని నిర్దేశించుకోవడంలో ప్రతి దేశానికి గల సార్వభౌమాధికార హక్కులకు విరుద్ధంగా ఉందని భారత ప్రతినిధి మయాంక్ జోషి స్పష్టం చేశారు.

11/20/2016 - 02:34

న్యూఢిల్లీ, నవంబర్ 19: ప్రతి ఓటమిని కూడా విజయానికి సోపానంగా మలుచుకోవచ్చనేది దివంగత ఇందిరాగాంధీ జీవితంనుంచి మనం నేర్చుకోవలసిన పాఠమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యంగా మలచుకోవచ్చన్నది ఆమె జీవితం, వారసత్వం మనకు నేర్పిన పాఠమని ఇందిరాగాంధీ శతజయంతి సందర్భంగా శనివారం ఇక్కడ ఇందిరాగాంధీ స్మారకోపన్యాసం చేస్తూ రాష్టప్రతి అన్నారు.

11/20/2016 - 02:33

న్యూఢిల్లీ, నవంబర్ 19: నాలుగు లోక్‌సభ స్థానాలతో పాటుగా వివిధ రాష్ట్రాల్లోని 10 అసెంబ్లీ స్థానాలకు శనివారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

11/20/2016 - 02:32

ఖమ్మం, నవంబర్ 19: ప్రజల ఇబ్బందులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కమీషన్ పద్ధతిలో పాత నోట్లకు కొత్త నోట్లు ఇచ్చేలా కొత్త తరహా వ్యాపారం జోరుగా సాగుతోంది. తమవద్ద కొత్తనోట్లు ఉన్నాయని, పాతనోట్ల స్థానంలో కమీషన్ పద్ధతిలో చెల్లుబాటు అయ్యే నోట్లు ఇస్తామంటూ, భారీ మొత్తంలో అయితే ఇవ్వాల్సిన మొత్తానికి సరిపోను భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ దళారులు చెప్పుకొస్తున్నారు.

11/20/2016 - 02:31

హైదరాబాద్, నవంబర్ 19: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రముఖ్, 93 ఏళ్ల వృద్ధ సైద్ధాంతికవేత్త కె సూర్యనారాయణ శుక్రవారం అర్ధ రాత్రి బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం ఉదయం బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఉంచారు. సాయంత్రం చామరాజపేట శ్మశానవాటికలో అంతిమసంస్కారం నిర్వహించారు. సూర్యనారాయణను అందరూ సురుజీగా పిలుస్తారు.

Pages