S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 00:51

కర్నూలు, నవంబర్ 19: రైతు ప్రభుత్వాలని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. శనివారం కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులను కలిసి, వారు ఎదుర్కొంటున్న కష్టాలను ఖర్గే తెలుసుకున్నారు.

11/20/2016 - 00:44

విశాఖపట్నం: ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక పరుగు తేడాతో ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరిగారు. మురళీ విజయ్ మూడు పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. లోకేష్ రాహుల్ పది పరుగులు చేసి, బ్రాడ్ బౌలింగ్‌లోనే వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టోకు దొరికిపోయాడు.

11/20/2016 - 00:41

విశాఖపట్నం: చివరి రెండు రోజులు తమకు పరీక్షా సమయమని, దీనిని సవాలుగా తీసుకుంటామని ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయర్‌స్టో అన్నాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడాడు. ఇప్పటికి తమ అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నాడు. మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే నాలుగో రోజు ఆటలో భారత్ బ్యాట్స్‌మెన్‌ను త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

11/20/2016 - 00:40

ఫజూ (చైనా), నవంబర్ 19: భారత స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు ఇక్కడ జరుగుతవున్న చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్‌లో సంగ్ జీ హ్యున్‌ను ఢీకొన్న ఆమె ఓటమి అంచు నుంచి బయటపడి, వరుసగా మూడు మ్యాచ్ పాయింట్లను నిలబెట్టుకుంది. అతి కష్టం మీద మ్యాచ్‌ని 11-21, 23-21, 21-19 తేడాతో సొంతం చేసుకుంది.

11/20/2016 - 00:39

క్రైస్ట్‌చర్చి, నవంబర్ 19: డెబ్యుడెంట్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ రికార్డు స్పెల్‌తో ఆరు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కట్టడి చేసిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో రాణించలేకపోయింది. మూడు వికెట్లకు 104 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించి, 200 పరుగులకు ఆలౌటైంది.

11/20/2016 - 00:39

కరాచీ, నవంబర్ 19: భారత్‌లో జరిగే జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. డిసెంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనేందుకు జూనియర్ హాకీ జట్టుకు పాక్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సరిహద్దులో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలకు తెరపడింది.

11/20/2016 - 00:35

ఆధారాలు

అడ్డం

11/20/2016 - 00:32

పత్రికా మిత్రులు ఎక్కువగా ఉపయోగించే పదం డెడ్‌లైన్. తెలుగులో దాన్ని మనం చివరి గడువు అంటాం. పత్రికలో ఆదివారం అనుబంధం పేజీలు ముగించడానికి ఓ చివరి గడువు ఉంటుంది. అదే విధంగా ప్రతీ పత్రికకి చివరి గడువు ఉంటుంది. వార్తలకి కూడా చివరి గడువు ఉంటుంది. ఆ చివరి గడువు తరువాత పత్రిక ప్రచురణకి వెళ్లిపోతుంది. సంపాదకీయానికి అంతే. చివరి గడువు లేనిదంటూ ఏమీ ఉండదు. ఆ చివరి గడువు తరువాత ఆ వార్తకి విలువ ఉండదు.

11/20/2016 - 00:30

1990 సంవత్సరంలో జరిగిన సంఘటన. అప్పుడు హైదరాబాద్‌లో నేను ఏడవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. అది ఆహార కల్తీ నేరాలు చేసిన వ్యక్తులని, మున్సిపల్ కార్పొరేషన్ చట్ట ప్రకారం నేరం చేసిన వ్యక్తులని శిక్షించే కోర్టు. వారంలో రెండు మూడు రోజులు హైదరాబాద్ నగరంలో క్యాంప్ కోర్టు నిర్వహించాలి. అందుకని మున్సిపల్ కార్పొరేషన్ ఆ కోర్టుకి ఓ అంబాసిడర్ కారుని ఏర్పాటు చేసింది.

11/20/2016 - 00:29

సంపద పెరిగే కొద్దీ ధనవంతుడివి మాత్రమే అవుతావు.
సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడివి మాత్రమే అవుతావు.
కానీ మంచితనం పెరిగే కొద్దీ మనిషిగా మారుతావు.

Pages