S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 05:14

విజయనగరం(టౌన్) నవంబర్ 18: విద్యార్ధులు దేశ గర్వించే విధంగా మంచి శాస్తవ్రేత్తలుగా ఎదగాలని ఎజెసి నాగేశ్వరరావు అన్నారు. మూడురోజులు పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్ధాయి ఇన్ స్ఫైర్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి.

11/19/2016 - 05:13

విజయనగరం, నవంబర్ 18: జిల్లాలో అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ తవ్వకాల నిరోధానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ కాళిదాసు తెలిపారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో మైనింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 22 మండలాల్లో ఇసుక రవాణాను నిరోధించేందుకు గనులశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

11/19/2016 - 05:13

సాలూరు, నవంబర్ 18: మున్సిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల నాణ్యతను శుక్రవారం సాయంత్రం పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ డిహెచ్ శ్రీనివాసరావు పరిశీలించారు. 24వార్డులో సిసి రోడ్డు, వేంకటేశ్వర డీలక్స్ సెంటర్‌లో జరుగుతున్న ప్రధాన మురుగుకాలువ నిర్మాణ పనులను మున్సిపల్ ఇంజనీర్లు డిఇ సుధాకర్, కమిషనర్ నాయుడు, ఎఇ వేణుగోపాల్, జాన్సన్‌తో కలసి పరిశీలించారు.

11/19/2016 - 05:13

విజయనగరం, నవంబర్ 18: సమాజంలో బాలలను కాపాడటం అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ కాళిదాసు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో నేచర్ చైల్డ్‌లైన్ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలను ఎవరైనా వేదిస్తే పోక్సో యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన పెంచుకోవాలన్నారు.

11/19/2016 - 05:11

శ్రీకాకుళం: అక్రమార్జనను వెనకేసుకున్న బడాబాబుల కూసాలు కదిలిపోయేలా ఆదాయపుపన్నుశాఖ (ఐటీ) రంగం సిద్ధం చేస్తోంది! పదులు వందలు కాదు వేల సంఖ్యలో నోటీసులు రెడీ చేసింది. మరికొద్దిరోజుల్లో బ్యాంకుఖాతాల్లో హైయర్ డినామినేషన్లు జమ చేసిన ఖాతాదారులకు తాఖీదులు అందించేందుకు సిద్ధమవుతోంది.

11/19/2016 - 05:10

శ్రీకాకుళం, నవంబర్ 18: ప్రధాని మోదీ పెద్దనోట్లు రద్దు నిర్ణయానికి పది రోజులు కావస్తున్నా వందనోట్లు లేమి అన్నివర్గాల ప్రజలకు చిల్లర కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులకు నగదు మార్పిడి సేవలు పుష్కలంగా అందుతున్నాయని సామాన్యులకు మాత్రం కష్టాలే మిగిలాయన్న కథనం శుక్రవారం ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన విషయం తెలిసిందే.

11/19/2016 - 05:08

ఒంగోలు,నవంబర్18:జిల్లాలోని జన్‌ధన్ పథకం ద్వారా రూపే కార్డులు పొందిన వినియోగదారులందరూ వాటిద్వారానే లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుజాతశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్‌డిఒలు, ఎంపిడిఒలు, ఎపిఒలు, ఎంపిఎంలతో కలెక్టరేట్ నుండి జన్‌ధన్ యోజన పథకంపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

11/19/2016 - 05:06

నెల్లూరు, నవంబర్ 18: తెలుగుదేశం పార్టీని తమ భుజస్కంధాలపై మోస్తున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని నారాయణ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో మృతి చెందిన 55 మంది టిడిపి కార్యకర్తల కుటుంబసభ్యులకు ఆయన రూ.2లక్షల వంతున ఆర్థిక సహాయం అందచేశారు.

11/19/2016 - 05:04

పాణ్యం, నవంబర్ 18 : బి.టెక్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో ఆర్‌జిఎం ప్రాంగణం అట్టుడికింది. ఆర్‌జిఎం ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉషారాణి వాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

11/19/2016 - 05:01

చిత్తూరు, నవంబర్ 18: జిల్లాలోని గ్రామపంచాయతీలకు ఈ ఆర్థిక సంవత్సరానికి 14 వ ఆర్థిక సంఘం నిధులు రూ 112.51 కోట్లు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇందులో మొదట విడతగా రూ 56, 25 కోట్లను కేటాయించామన్నారు. ఇందులో పారిశుద్ధ్యం పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Pages