S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభివృద్ధి పనులు, నాణ్యత పరిశీలించిన పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ

సాలూరు, నవంబర్ 18: మున్సిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల నాణ్యతను శుక్రవారం సాయంత్రం పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ డిహెచ్ శ్రీనివాసరావు పరిశీలించారు. 24వార్డులో సిసి రోడ్డు, వేంకటేశ్వర డీలక్స్ సెంటర్‌లో జరుగుతున్న ప్రధాన మురుగుకాలువ నిర్మాణ పనులను మున్సిపల్ ఇంజనీర్లు డిఇ సుధాకర్, కమిషనర్ నాయుడు, ఎఇ వేణుగోపాల్, జాన్సన్‌తో కలసి పరిశీలించారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు అభివృద్ధి పనులు పరిశీలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొంత మంది వ్యక్తులు వారికి ఫిర్యాదు చేశారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదని, నిధులు దుర్వినియోగమవుతున్నాయని పట్టణానికి చెందిన హరిరెడ్డి, బి.శివప్రసాద్‌లు ఫిర్యాదు చేశారు. ఇంజనీర్లు లేకుండానే ఈ పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని చెప్పారు. దీనిపై ఎస్‌ఇ, ఇఇ విన్పించుకోకపోవడంతో హరిరెడ్డి, శివప్రసాద్‌లు వారితో వాగ్వాదానికి దిగారు. పరిశీలనానంతరం ఇంజనీర్లు అక్కడ నుంచి వెళ్లిపోయారు.