S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచి శాస్తవ్రేత్తలుగా ఎదగాలి

విజయనగరం(టౌన్) నవంబర్ 18: విద్యార్ధులు దేశ గర్వించే విధంగా మంచి శాస్తవ్రేత్తలుగా ఎదగాలని ఎజెసి నాగేశ్వరరావు అన్నారు. మూడురోజులు పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్ధాయి ఇన్ స్ఫైర్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్ఫైర్ ద్వారా విద్యార్థ్ధులను ప్రోత్సహిస్తూ వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం ఇటువంటి విజ్ఞాన ప్రదర్శనల ద్వారా అభిస్తుందన్నారు. దేశానికి ఉపయోగ పడే ఆవిష్కణలపై విద్యార్ధులు దృష్టిసారించాలన్నారు. మంచి శాస్తవ్రేత్తలుగా రాణించడానికి పోటీలు సద్వినియోగం చేసకుని రాష్ట్ర జాతీయ స్ధాయిల్లో రాణించి మంచిపేరు జిల్లాకు, తల్లిదండ్రులకు, ప్రతిభను గుర్తించిన టీచర్లకు మంచి పేరుతీసుకురావాలని తెలిపారు. విద్యార్థుల దృష్టి ఎంసెట్ వాటిపైనే కాదని గణితం,్ఫజిక్స్ వంటి సబ్జెక్టుల్లో చదవడంద్వారా మంచి విద్యావేత్తలుగా ఉన్నతశిఖరాలు అందుకునే అవకాశం ఉందన్నారు. ఈసందర్భంగా విశాఖ, విజయనగరం జిల్లాల విద్యార్థులు ప్రదర్శించిన వాటిలో మేలైన వాటిని ఎంపిక చేశారు. విశాఖ జిల్లానుండి ఈ పోటీల్లో పాల్గొన్న 43 ప్రదర్శనల్లో నాలుగు, జిల్లానుండి పాల్గొన్న 13 ఎగ్జిబిట్స్‌ను 24వతేదీ నుండి కాకినాడలో జరిగే రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఓటమితో బాధపడవద్దని, సమాజంలో సామాజిక అంశాలపై రూపొందించిన అంశాలతో రాణించడానికి విద్యార్ధులు మందుండాలన్నారు. విశాఖ జిల్లా నుండి ఎంపికైన వాటిలో విండ్‌మిల్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ వ్యవసాయం, వాటర్ అనుబంధ ప్రాజెక్టులు ఉన్నాయి. సేక్రెడ్ పాఠశాల, ఆర్‌విపురం జెడ్పీ హెచ్ స్కూలు, నాతవరం పాఠశాల విద్యార్థులు రాష్ట్ర పోటీలకు ఎంపిక అయ్యారు. విజయనగరం నుండి జెడ్పీహెచ్ స్యూలు లక్కిడాం విండ్‌మిల్, సముద్ర ప్రాంత వాసులకు తాగునీరు అంశం కెజిబివి విజయనగరం, ఎకో కూలర్, ప్లాస్టిక్ నుండి ఇటుకల తయారీ, పోలీహౌస్, లోకాస్ట్ కూలర్, చెత్తను మోనటరింగ్ చేసే విధానం ఊపిరితిత్తుల పనితీరు టెస్ట్ పరికరం, వ్యవసాయం ఉన్నాయి. రాష్టస్ధ్రాయికి ఎంపికైన వాటిలో కోనాడ, కొట్యాడ, పూసపాటిరేగ, తెట్టంగి, జామి, జొన్నాడ, బిజెపురం జెడ్పీహెచ్ స్కూల్స్ ఉండగా శ్రీకృష్ణా, ఎంపి యుపి స్కూలు బంగారమ్మపేట ఉన్నాయి. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అరుణకుమారి, ఎస్‌ఎస్‌ఎ పిఒ లక్ష్మణరావు, డిప్యూటీ డిఇఒ లింగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.