S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 05:31

హైదరాబాద్, సెప్టెంబర్ 25: అనుభవంతో వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వర రావు సతీమణి చెన్నమనేని లలితా దేవి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె తనయుడు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, వారి కుటుంబ సభ్యులు 12వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.

09/26/2016 - 05:29

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ముస్లిం పర్సనల్ లా బోర్డులోని ట్రిపుల్ ‘తలాఖ్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పర్సనల్ లా బోర్డులోని ‘తలాఖ్’ అంశంపై ముస్లిం మహిళల్లో రగడ కొనసాగుతోంది. నిరక్షరాస్యత, పేదరికంతో ముస్లిం పర్సనల్ లాలోని తలాఖ్ అనే షరియత్ జీవించే హక్కును హరింపజేస్తోందని రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

09/26/2016 - 05:29

హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో వారం రోజులుగా భారీ వర్షాల వల్ల సహాయక చర్యలు చేపట్టడంలో మంత్రులు, అధికార యంత్రాంగం తలమునకలై ఉండటంతో సోమవారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశాన్ని వాయిదా వేసినట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

09/26/2016 - 05:28

హైదరాబాద్, సెప్టెంబర్ 25: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి (ఎంసిఆర్-హెచ్‌ఆర్‌డి) ఇనిస్టిట్యూట్‌ను వాషింగ్టన్‌లోని జార్జిటౌన్ యూనివర్సిటీ, సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఇ-గవర్నమెంట్ లీడర్‌షిప్ సెంటర్‌కు చెందిన ప్రతినిధులు ఆదివారం సందర్శించారు.

09/26/2016 - 05:27

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మన దేశ భూభాగంలో పాకిస్తాన్ అశాంతిని ప్రేరేపిస్తున్నదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందా స్ అతవాలే మండిపడ్డారు. పాకిస్తాన్‌పై ఎటువంటి చర్యలకైనా వెనుకాడబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారని ఆయన ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడాని కి పాక్ ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు.

09/26/2016 - 05:17

విజయవాడ, సెప్టెంబర్ 25: అమరావతి ప్రాంతంలో అందునా కృష్ణానదీ తీరాన రాజధాని నిర్మాణం పర్యావరణానికే గొడ్డలిపెట్టు అంటూ పర్యావరణ జాతీయ ట్రిబ్యునల్‌లో పోరాడుతున్న సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ నేతృత్వంలో రెండురోజులపాటు ఆ ప్రాంతంలో పర్యటించిన నిపుణుల బృందం వాస్తవిక పరిస్థితులను చూసి విస్మయానికి గురైంది.

09/26/2016 - 05:16

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 25: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వినూత్న ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి సోమవారం ఉదయం 9:12 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 8 ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఇందులో భాగంగా శనివారం ప్రారంభమైన కౌంట్‌డౌన్ సజావుగా సాగుతోంది.

09/26/2016 - 05:13

తిరుపతి, సెప్టెంబర్ 25: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం గొప్ప లక్ష్యాలతో ఏర్పాటు చేసిందని, ఆ దిశగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతో ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం వేదిక్ వర్శిటీని సందర్శించిన ఆయన ఆచార్యులతో సమావేశమయ్యారు.

09/26/2016 - 05:08

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మం త్రుల తనయులపై వస్తున్న ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందించిన ఏపి ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిని పిలిచి క్లాసు పీకి, ఇదే చివరి హె చ్చరిక అన్నారు. మీ పనితీరు మార్చుకోవాలని, నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకుండా, వివాదాలకు దూరంగా ఉండి, జననేతలుగా ఎదగాలని హిత వు పలికారు.

09/26/2016 - 05:07

తిరుమల, సెప్టెంబర్ 25: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ బం దోబస్తుతో పాటు భక్తులకు పోలీస్ శాఖ తరపున స్నేహపూర్వకంగా సేవ లు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రాయలసీమ ప్రాం తానికి చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో కలసి ఆలయ తిరుమాడ వీధులు, రాంభగీచ తదితర ప్రదేశాలను పరిశీలించారు.

Pages