హెచ్‌ఆర్‌డిని సందర్శించిన విదేశీ వర్సిటీల బృందాలు
Published Monday, 26 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 25: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి (ఎంసిఆర్-హెచ్ఆర్డి) ఇనిస్టిట్యూట్‌ను వాషింగ్టన్‌లోని జార్జిటౌన్ యూనివర్సిటీ, సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఇ-గవర్నమెంట్ లీడర్షిప్ సెంటర్‌కు చెందిన ప్రతినిధులు ఆదివారం సందర్శించారు. సంస్ధ డైరెక్టర్ జనరల్, ఇవో స్పెషల్ సెక్రటరీ వినోద్ కె.అగర్వాల్ ఆ వర్సిటీల ప్రతినిధులతో చర్చలు జరిపి సంయుక్త సహకారంతో పని చేయాలని భావించారు. ఈ సందర్భంగా ఎంసిఆర్-హెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.