S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 05:57

నర్సంపేట / కొత్తగూడ, సెప్టెంబర్ 25: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలన్నీ నిండుకుని మత్తడులు పడుతున్నాయి. జిల్లాలోనే అతిపెద్ద చెరువు అయిన పాఖాల చెరువు గరిష్ట నీటి సామర్థ్యం 30.2 అడుగులు కాగా శనివారం రాత్రి ఎనిమిది గంటలకు చెరువు నీటి సామర్థ్యానికి చేరుకుని మత్తడి పడింది.

09/26/2016 - 05:57

పరకాల, సెప్టెంబర్ 25: సత్వరమే న్యాయం అందించాలని హైకోర్టు న్యాయమూర్తి పి. నవీన్‌రావు అన్నారు. ఆదివారం పరకాల సివిల్ జడ్జి కోర్టు నూతన భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తి పి. నవీన్‌రావు ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి పి.

09/26/2016 - 05:55

కరీంనగర్, సెప్టెంబర్ 25: కరీంనగర్ జిల్లాలో మూడ్నాలుగు రోజుల నుండి కనీవిని ఎరుగని రీతిలో భారీ వర్షాలు పడి వాగుల్లో వరద ఉదృతి పెరిగిందని, వరదల వల్ల ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు.

09/26/2016 - 05:54

కరీంనగర్, సెప్టెంబర్ 25: నిర్మాణ దశలో ఉన్న మిడ్‌మానేర్ ప్రాజెక్టును వరద ముంచెత్తింది. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆదివారం సాయంత్రానికి కల్లా ఉగ్రరూపం దాల్చి..చివరకు రాత్రి సమయాన ప్రాజెక్టుకు గండి పడింది.

09/26/2016 - 05:52

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు సాధారణ సగటు వర్షపాతం 475.2 మి.మీకు 532.2 మి.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలకు నాలుగు జిల్లాలో వర్షం లోటు కొనసాగుతోంది. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వర్షం లోటు నమోదైంది.

09/26/2016 - 05:52

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఆంధ్ర రాజధాని అమరావతిలో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను చురుకుగా పరిశీలిస్తున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ మేరకు తాను పంపిన వినతిపత్రంపై స్పందించి ఆర్‌బిఐ లేఖ పంపిందని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు.

09/26/2016 - 05:51

విశాఖపట్నం (క్రైం), సెప్టెంబర్ 25: ఎంతోకాలంగా స్థానిక కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ విమల్‌పై పోలీసులు పెట్టిన కేసులు కోర్టులో వీగిపోవడంతో ఆయనను ఇక్కడి కోర్టు విడుదల చేయనున్నట్టు ఆదివారం రాత్రి విశ్వసనీయంగా తెలిసింది.

09/26/2016 - 05:50

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 25: తాను చేసిన దీక్ష దొంగదో, లేక నిజాయితీతో చేసిందో సమాజానికి తెలియజేయడం కోసం ఇది వరకే ప్రకటించినట్లు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపడదామని నాతో మీరు, మీ కుమారుడు కూర్చోవాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు.

09/26/2016 - 05:50

హైదరాబాద్, సెప్టెంబర్ 25: వైకాపా నేతలు హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలపై మాట్లాడడం, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న సహాయక చర్యలను విమర్శించడం అసందర్భం, అసమంజసమని టిడిపి ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఆదివారం ఆయనన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు వరద,్భరీ వర్షాల ప్రాంతాల్లో పగలు రాత్రి తేడా లేకుండా పర్యటించి ప్రజలను ఆదుకున్నారన్నారు.

09/26/2016 - 05:49

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మరో ఆరు నెలల్లో ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తవుతుంది. ఒక వైపు ఆర్ధిక లోటుతో కటకట. మరో వైపు కేంద్రం నుంచి ఆశించిన స్ధాయిలో నిధులు అందక సంక్షోభంలో కూరుకున్న రాష్ట్రానికి కేంద్రం విదేశీ రుణాలు సకాలంలో అందకుండా వేస్తున్న కొర్రీలతో అట్టహాసంగా ప్రారంభించిన 13 ప్రాజెక్టులు టేకాఫ్ కావడం లేదు. దాదాపు రూ.

Pages