S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 07:32

పాణ్యం, జూలై 26: కర్నూలు జిల్లా పాణ్యంలో మంగళవారం జంట హత్యలు జరిగాయి. రైల్వేస్టేషన్ సమీపంలో పట్టపగలు ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అన్నదమ్ములను నరికి చంపడం కలకలం రేపింది. కొలిమిగుండ్ల మండలం బోయ ఉప్పలూరుకు చెందిన దారా ఓబులేసు (35), దారా లక్ష్మయ్య (33)లను ప్రత్యర్థులు పాణ్యం రైల్వేస్టేషన్ సమీపంలో వేటకొడవళ్లతో నరికి చంపారు. 2015లో జరిగిన గొల్ల రామకృష్ణ హత్య కేసులో ఓబులేసు, లక్ష్మయ్య ప్రధాన నిందితులు.

07/27/2016 - 07:29

హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలో పింఛను పథకంతో లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 200 నుంచి ఏకంగా వెయ్యి రూపాయలు అందుకుంటున్న వారి సంతోషం పార్టీకి-ప్రభుత్వానికి అనుకూలంగా మారలేకపోతోంది. అం దుకే బాబు ‘్భరోసా’పథకంపై సీరియస్‌గా దృష్టి సారించారు. పింఛన్లపై భారీ స్థాయిలో గ్రామసభల వేదికగా ప్రచారం సాగాలన్న లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

07/27/2016 - 07:23

గండేపల్లి, జూలై 26: పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు ప్రస్తుతం ఆ కాలువపై నిర్మించిన కల్వర్టులపై వరి సాగు చేపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామం వద్ద నిర్మించిన రెండు కల్వర్టులపై రైతులు ఈ సాగు ప్రయోగం చేపట్టారు. వర్షపు నీటితో కొట్టుకువచ్చిన మట్టి, నీరుకు అడ్డుకట్టలు వేసి నిల్వచేసి, అందులో సాగు ప్రారంభించారు.

07/27/2016 - 07:23

నల్లగొండ, జూలై 26: కృష్ణా పుష్కరాల కోసం నల్లగొండ జిల్లా పరిధిలోని 28 పుష్కర ఘాట్‌లకు కోటిన్నర మంది భక్తుల వస్తారని అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం వారికి అవసరమైన వౌలిక వసతుల కల్పనలో మాత్రం దారుణంగా వెనుకబడింది. తాగునీటి వసతి కోసం ఆర్‌డబ్ల్యుఎస్ శాఖకు 18.3 కోట్లు విడుదల చేశారు.

07/27/2016 - 07:21

రాజమహేంద్రవరం, జూలై 26: పోలవరం ఎడమ కాల్వ లక్ష్యం మేరకు పూర్తయ్యే పరిస్థితులు కన్పించడం లేదు. ఆగమేఘాలపై కుడికాల్వ పనులు పూర్తిచేసి, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తరలిస్తున్నట్టుగానే ఎడమ గట్టుపై మరో ఎత్తిపోతల పథకం నిర్మించి, ఎడమ కాల్వ ద్వారా విశాఖకు నీళ్లు తరలించడానికి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

07/27/2016 - 07:20

ఇబ్రహీంపట్నం, జూలై 26: సుమారు రూ.350 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తున్నట్లు భూమి యజమాని మల్లెల అనంత పద్మనాభరావు తెలిపారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద విజయవాడ సబ్ కలెక్టర్ సృజనకు ప్రభుత్వానికి భూమిని ఇస్తున్నట్లు మంగళవారం విల్లింగ్ ధ్రువీకరణ పత్రం అందజేశారు.

07/27/2016 - 07:04

హైదరాబాద్, జూలై 26: అవును.. మీరు వింటున్నది నిజమే. ఇదెక్కడో చైనాలో కాదు. ఆంధ్రప్రదేశ్‌లోనే! భారీ సంపత్తి, జనాభా, యుద్ధపరికరాలతో చైనా అందరినీ భయపెడుతుంటే, చైనాను ఎలుకలు వణికిస్తున్నాయి. దానితో దిద్దుబాటుకు దిగిన చైనా ప్రభుత్వం, ఒక ఎలుకను చంపి తీసుకువచ్చిన వారికి నగదు బహుమతి ప్రకటించింది. ఆ పథకం ఇప్పుడూ అమల్లో ఉంది. ఢిల్లీలో పార్లమెంటుకు కోతుల బెడద ఎక్కువ. పార్లమెంటుకే కాదు.

07/27/2016 - 07:03

విజయవాడ, జూలై 26: కాపులను బిసిలుగా గుర్తించేందుకు నియమించబడిన జస్టిస్ మంజునాధ్ కమిషన్ ఆగస్టు మాసాంతంలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న నేపధ్యంలో ఇప్పటికే అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, సభలు, సమావేశాలు ఊపందుకోటం ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో గుంటూరుకు చెందిన సీనియర్ నేత లింగంశెట్టి ఈశ్వరరావును కాపు రిజర్వేషన్ సాధికారిత విభాగం చైర్మన్‌గా పార్టీ నియమించింది.

07/27/2016 - 07:03

హైదరాబాద్, జూలై 26 : గోదావరి ఆదిపుష్కరాలకు ప్రభుత్వపరంగా భారీ హంగామా జరగగా, అంత్యపుష్కరాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 2016 జూలై 31 (ఆషాడ బహుళ త్రయోదశి) నుండి ఆగస్టు 11 (శ్రావణ మాసం శుద్దఅష్టమి) వరకు గోదావరి అంత్యపుష్కరాలు నిర్వహించాల్సి ఉంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఎపి ప్రభుత్వం ఈ కార్యక్రమం గురించి పెద్దగా ఆలోచించడం లేదు.

07/27/2016 - 07:02

హైదరాబాద్, జూలై 26: ఆంధ్రప్రదేశ్ పునర్య్వవస్థీకరణ చట్టం కింద పదో షెడ్యూల్‌లో పొందుపరిచిన సంస్థల సేవలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు అందించే విధంగా రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మెసర్స్ వరాహ కాలేజీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ సంస్ధకు భౌగోళిక ప్రాతిపదికన గుర్తింపు ఇవ్వడానికి హైదరాబాద్‌లోని జెఎన్‌టియు నిరాకరించింది.

Pages