S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 14:18

దిల్లీ: మానవ హక్కుల కార్యకర్త బెజ్‌వాడ విల్సన్‌, సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి ఎంపికయ్యారు. ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రామన్‌ మెగసెసె పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ఏటా అందజేస్తారు.

07/27/2016 - 12:23

విజయవాడ: ఎపి మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఇక్కడ విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, పుష్కరాల్లో విద్యాశాఖ భాగస్వామ్యం, మనం-వనం తదతర అంశాలపై ఆయన చర్చించారు.

07/27/2016 - 12:22

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన చార్మినార్ మాజీ కార్పొరేటర్ అహ్మద్ గౌస్‌ను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం అరెస్టు చేసింది. పెండింగ్ వారంట్లకు సంబంధించి ఆయనను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

07/27/2016 - 12:22

ఒంగోలు: తెలంగాణలో ఎంసెట్-2 పేపర్ లీకేజీకి సంబంధం ఉందన్న అనుమానంతో ప్రకాశం జిల్లా కనిగిరిలో వెలుతుర్ల ఖాసిం అనే వ్యక్తిని తెలంగాణ సిఐడి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరో నిందితుడి సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా ఖాసింను పోలీసులు అనుమానించారు. రెండురోజులుగా కనిగిరిలో సిఐడి అధికారులు మకాం వేసి ఖాసిం ఆచూకీని కనుగొన్నారు.

07/27/2016 - 12:21

హైదరాబాద్: ఓ వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించగా, పోలీసుల తీరుపై ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్ రాజ్‌కాలనీలో హరిణి అనే గృహిణి మంగళవారం అర్ధరాత్రి మరణించింది. ఆమెను అత్తింటివారే చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని చూసేందుకు తమను అనుమతించక పోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

07/27/2016 - 12:21

కడప: రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన ఒంటిమిట్ట కోదండరామాలయంలో త్వరలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన బుధవారం నాడు ఒంటిమిట్టలో ఆధునిక వసతులతో నిర్మించే సత్రానికి శంకుస్థాపన చేశారు.

07/27/2016 - 12:20

ఒంగోలు: హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ఎసి స్లీపర్ బస్సు బుధవారం ఉదయం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఓ లారీని ఢీకొన్న బస్సులో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ సహా ప్రయాణికులంతా బయటకు పరుగులు తీశారు. క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో 23 మంది ప్రయాణీకులు క్షేమంగా బతికి బయటపడగా వారి లగేజీ మాత్రం కాలిపోయింది.

07/27/2016 - 12:20

కర్నూలు: అధ్యాపకుడు కొట్టాడని తీవ్ర మానసిక వేదనకు గురైన సందీప్ అనే విద్యార్థి మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్ తీరు పట్ల నిరసనగా బుధవారం ఉదయం కళాశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన ప్రారంభించారు.

07/27/2016 - 12:18

ఢిల్లీ: ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నినాదాలు చేస్తూ బుధవారం విపక్షాల ఎంపీలు రాజ్యసభలో పోడియం వద్దకు దూసుకెళ్లారు. మధ్యప్రదేశ్లో దళితులపై దాడి అంశంపై సభ దద్దరిల్లింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులు చేయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

07/27/2016 - 12:15

బెంగళూరు : బెంగళూరు నుంచి హుబ్లీ-ధార్వాడ్ వెళుతున్న ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మంటల్లో చిక్కుకుని మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. బెంగళూరు-పుణె జాతీయ రహదారి వరూర్ సమీపంలో గత రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 16మంది ప్రయాణిస్తున్నారు.

Pages