S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 07:01

హైదరాబాద్, జూలై 26: తన సొంత నియోజకవర్గంలోనే ప్రజలపై లాఠీచార్జి చేయించి దేశంలో ఏ సిఎం సాధించని విధంగా చరిత్రకెక్కారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద రాష్టస్థ్రాయి మహాధర్నా నిర్వహించారు.

07/27/2016 - 07:00

హైదరాబాద్, జూలై 26: ప్రజలను ఒప్పించి భూసేకరణ జరుపుతాం, ఎవరు అడ్డుకున్నా ప్రాజెక్టులు కట్టి తీరుతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి విపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

07/27/2016 - 07:00

న్యూఢిల్లీ, జూలై 26:పధ్నాలుగు సంవత్సరాల లోపు వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్ మంగళవారం ఓ కీలక బిల్లును ఆమోదించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల జైలు శిక్ష విధించేందుకు, ఆ పిల్లల తల్లిదండ్రులపైనా జరిమానా వేసేందుకూ ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.

07/27/2016 - 06:59

న్యూఢిల్లీ,జూలై 26: జిఎస్‌టి బిల్లుకు సంబంధించి రాష్ట్రాలు చేసిన అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం విజ్ఞన్‌భవన్‌లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో జరిగిన సాధికరిక కమిటీ సమావేశంలో యనమల మాట్లాడారు. ఈ బిల్లుపై రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఆందోళనలకు కేంద్రం పరిష్కారాన్ని అందించలేదన్నారు.

07/27/2016 - 06:58

న్యూఢిల్లీ, జూలై 26: మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతుల నుండి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా భూములు తీసుకుంటోందని కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఏ.ఖాన్ మంగళవారం రాజ్యసభలో ఆరోపించారు. రాజ్యసభ జీరో అవర్‌లో మల్లన్నసాగర్ రైతుల సమస్యల గురించి ప్రస్తావించేందుకు డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్‌తో ఖాన్ వాగ్వివాదానికి దిగారు.

07/27/2016 - 06:58

హైదరాబాద్, జూలై 26: వచ్చే ఏడాది జూలై నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. సౌరవిద్యుత్ రంగంలో గ్లోబల్ హబ్ ఏర్పాటు చేసేందుకు అనేక విదేశీ, దేశీయ సంస్థలు ముందుకు వచ్చాయి.

07/27/2016 - 06:35

న్యూఢిల్లీ, జూలై 26: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా.. తమ ప్రత్యర్థి జబాంగ్‌ను చేజిక్కించుకుంది. దాదాపు 470 కోట్ల రూపాయలకు (70 మిలియన్ డాలర్లు) గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్ (జిఎఫ్‌జి) నుంచి కొనుగోలు చేసింది. జబాంగ్‌ను సొంతం చేసుకోవాలని స్నాప్‌డీల్, ఫ్యూచర్ గ్రూప్, ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన ఎబోఫ్ తదితర సంస్థలు పోటీపడినా ఫలితం లేకపోయింది.

07/27/2016 - 06:35

తిమ్మాపూర్, జూలై 26: మెదక్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అసెంబ్లీ నుండి మల్లన్న సాగర్ వరకు చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా జిల్లా కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయం హైదరాబాద్ వైపునకు తరలివెళ్తుండగా మార్గమధ్యలో తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ చౌరస్తాలో జిల్లా పోలీసులు సిఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీ్ధర్‌బా

07/27/2016 - 06:35

కరీంనగర్, జూలై 26: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో గోదావరి నది ప్రవాహం పెరగడం.. గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారడం.. ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల చెంతకు చేరుతుండటం వెరసి.. ఎల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలు తమ గ్రామాలను ఏ రాత్రి ముంచెత్తుందోననే ఆందోళనతో క్షణక్షణం.. భయం భయంగా గడుపుతున్నారు.

07/27/2016 - 06:34

చొప్పదండి, జూలై 26: కరవు కోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు విమర్శించారు. మంగళవారం చొప్పదండి నియోజగవర్గ కేంద్రంలోని జాతీయ రహదారిపై నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు బ్యాం కుల ఎదుట మహాధర్నాను నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.

Pages