S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 06:33

కరీంనగర్, జూలై 26: మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత నివ్వాలని హరితహారం కార్యక్రమ జిల్లా ఇన్‌చార్జి, ఐజి డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డిపిటిసి)లో మొక్కలు నాటి ఈ సందర్బంగా మాట్లాడారు.

07/27/2016 - 06:32

చందుర్తి, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు కోటి 87లక్షల మొక్కలు నాటామని, అగస్టు చివరి నాటికి మరో కోటి 50లక్షల మొక్కలు నాటుతామని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. మంగళవారం చందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 214లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి, కలెక్టర్ స్వయంగా మొక్కలు నాటారు.

07/27/2016 - 06:31

హుజూరాబాద్, జూలై 26: మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో వ్యవసాయ భూమి విషయమై నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో ఓ విఆర్‌వోతో సహా ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

07/27/2016 - 06:31

లీగల్ (కరీంనగర్), జూలై 26: ఇటీవల సవరించిన 41 సిఆర్‌పిసి వలన ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, దీనిపై లోతుగా పరిశీలించి రద్దుకు కృషి చేయనున్నట్లు కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఎంపిని ఢిల్లీలో తన నివాసంలో కలిసి 41 సిఆర్‌పిసి సవరణ రద్దుకు కృషి చేయాలని కోరారు.

07/27/2016 - 06:29

వరంగల్, జూలై 26: సర్కారీ స్కూళ్లను బలోపేతం చేయాలని అనేక సంస్కరణలు చేపట్టినా పలితం లేకుండా పోతోంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోవడం లేదు. కెజి టు పిజి మాట దేవుడెరుగు కనీసం ఉన్న పాఠశాలలైనా సక్రమంగా నడువక విద్యావ్యవస్థ బ్రష్టుపడుతోందనే విమర్శలు వస్తున్నాయి.

07/27/2016 - 06:28

వడ్డేపల్లి, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న హరిత హారం కార్యక్రమంలో ఖాలీగా ఉన్న బంజరు, అసైన్డ్ భూములను వినియోగించుకునేలా ప్రయత్నం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హైదరాబాదునుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాదు నుండి పోచారం మాట్లాడారు.

07/27/2016 - 06:27

పరకాల / ఆత్మకూరు, జూలై 26: ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం కాలరాస్తోందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. మంగళవారం లాఠీచార్జి బాధితులను పరామర్శించడానికి వెళ్తుతుండగా ఇనగాల వెంకట్రాంరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం గోషామహల్ స్టేడియంలో నిర్బంధించారు.

07/27/2016 - 06:27

ముంబయి, జూలై 26: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 118.82 పాయింట్లు కోల్పోయి 27,976.52 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 45 పాయింట్లు దిగజారి 8,590.65 వద్ద నిలిచింది. అమెరికా, జపాన్ సెంట్రల్ బ్యాంక్‌ల సమావేశాల క్రమంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు.

07/27/2016 - 06:27

స్టేషన్ ఘన్‌పూర్, జూలై 26: స్వాతంత్య్ర సమరయోధుడు, చాగల్ మాజీ సర్పంచ్ మారం శేఖరయ్య (98) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. మృతి చెందిన శేఖరయ్య స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని గ్రామానికి చెందిన పలు పార్టీల సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు.

07/27/2016 - 06:26

వడ్డేపల్లి, జూలై 26: నిరుపేదలందరికీ 58జీవో ప్రకారం వ్యక్తిగత డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించివ్వాలని పట్టణ ప్రజల సంక్షేమ సంఘం నగర నాయకులు టి.ఉప్పలయ్య అన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ప్రభుత్వ, చెరువుశిఖం, దేవాదాయ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలందరికీ 58జీవో ప్రకారం వ్యక్తిగత ఇండ్లు నిర్మించివ్వాలని మంగళవారం హన్మకొండ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.

Pages