S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 17:47

దిల్లీ: తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో లేదని కేంద్రం బుధవారం రాజ్యసభలో స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలకు పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. వాస్తవానికి నియోజకవర్గాల పునర్‌ విభజన 2026లో జరగాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం ఈ రెండు రాష్ర్టాల్లోనూ ముందుగానే స్థానాలు పెంచాలని కోరుతున్నారు.

07/27/2016 - 17:43

విజయవాడ: సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ బదిలీ అయ్యారు. నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా శ్రీకాంత్‌, సీఆర్డీఏ కమిషనర్‌గా గుంటూరు జేసీ శ్రీధర్‌, విశాఖ ఈపీడీసీఎల్‌ సీఎండీగా ఎంఎం నాయక్‌, విజయనగరం కలెక్టర్‌గా వివేక్‌ యాదవ్‌ను బదిలీ చేశారు.

07/27/2016 - 17:40

చెన్నై: ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) మంగళవారం ప్రభుత్వ అధికారులతో చేపట్టిన చర్చలు విఫలమవ్వడంతో గతంలో సమ్మెకు పిలుపు ఇచ్చిన మాదిరిగానే శుక్రవారం (జులై 29న) ఒక్కరోజు సమ్మె చేయనున్నట్లు బ్యాంకు యూనియన్ల ఫోరం వెల్లడించింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం కూడా జులై 29న సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.

07/27/2016 - 17:38

మెదక్‌: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ గ్రామస్థులు ముందుకొచ్చారు. గజ్వేల్‌లో పల్లెపహాడ్‌ రైతులు, గ్రామస్థులతో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ చర్చలు బుధవారం జరిపారు. మంత్రి హామీతో ప్రాజెక్టుకు భూములిచ్చేందుకు పల్లెపహాడ్‌ రైతులు అంగీకారం తెలిపారు.

07/27/2016 - 15:09

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంలో 16 మంది బ్రోకర్లకు ప్రమేయం ఉన్నట్టు కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే చాలామంది బ్రోకర్లను ప్రశ్నించారు. పేపర్ లీకేజీ వెనుక ప్రధాన సూత్రధారులెవరున్నారన్న అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్‌లోనే పేపర్ లీక్ అయిందన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

07/27/2016 - 15:08

చెన్నై: దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం రామేశ్వరంలో ఆయన శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్ తదితరులు పాల్గొని దేశానికి కలాం చేసిన సేవలను గుర్తుచేశారు.

07/27/2016 - 15:08

దిల్లీ: బిజెపి పాలిత రాష్ట్రాల్లో గోసంరక్షణ ముసుగులో దళితులపై దాడులు మితిమీరిపోతున్నాయని రాజ్యసభలో బుధవారం బిఎస్‌పి సభ్యులు ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో గోమాంసం తీసుకువెళుతున్నారన్న నెపంతో ఇద్దరు దళిత మహిళలను గోసంరక్షణ కార్యకర్తలు చితకబాదడం దారుణమని బిఎస్‌పి ఎంపీలు అన్నారు. పోడియం వద్దకు వారు చేరుకుని ప్రధాని మోదీ దళిత వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు.

07/27/2016 - 15:07

నల్గొండ: ప్రైవేటు విద్యాసంస్థల్లో అరాచకాలను అరికట్టాలని ఎబివిపి ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై ఓ ప్రైవేటు కాలేజీ చైర్మన్ చేయి చేసుకోవడంతో హుజూర్‌నగర్‌లో బుధవారం ఉద్రిక్తత ఏర్పడింది. తమపై దాడి చేసిన కాలేజీ చైర్మన్‌పై చర్య తీసుకోవాలని విద్యార్థులు ధర్నా ప్రారంభించగా వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు.

07/27/2016 - 15:07

ముంబయి: మరఠ్వాడా ప్రాంతం నుంచి అదృశ్యమైన వందమంది ముస్లింలు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరారని శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ మహారాష్ట్ర అసెంబ్లీలో పేర్కొన్నారు. ఐసిస్‌కు హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇస్తున్నందున ఆ పార్టీని దేశంలో రద్దు చేయాలన్నారు. ఉగ్రవాద సంస్థల్లో అమాయక ముస్లింలు చేరకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

07/27/2016 - 14:21

తిరుమల: తిరుమలలో శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పించే మొబైల్‌ హుండీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన అర్జున్‌ అనే వ్యక్తి రూ.50వేలు కాజేశాడు . నిందితుడిని తిరుమల క్రైం పోలీసులకు అప్పగించారు. సీసీ కెమెరాల ద్వారా చోరీని గుర్తించిన తితిదే విజెలెన్స్‌ విభాగం అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.

Pages