S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 06:26

న్యూఢిల్లీ, జూలై 26: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరో మూడు బ్యాంకులపై మంగళవారం జరిమానా విధించింది. మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘనకుగాను అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లపై 2 కోట్లు చొప్పున, బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కోటి మేర జరిమానా వేసింది. సోమవారం బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లపై 10 కోట్ల జరిమానా విధించింది.

07/27/2016 - 06:25

వడ్డేపల్లి, జూలై 26: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెరాస ఎన్నికల మ్యానిఫెఫ్టోలో పొందుపరచిన రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క ఆరోపించారు.

07/27/2016 - 06:25

న్యూఢిల్లీ, జూలై 26: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 1,486.2 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 1,208.1 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకోగా, ఈసారి 23 శాతం లాభం పెరిగినట్లైంది. నికర అమ్మకాలు ఈసారి 14,654.5 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 13,078.3 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

07/27/2016 - 06:25

వడ్డేపల్లి, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నగరాభివృద్ధికి కేటాయించిన రూ. 300 కోట్ల నిధుల్లో సింహభాగం రూ. 165కోట్లను 42 విలీన గ్రామాల్లో రక్షిత తాగునీటి సౌకర్యం, వౌలిక వసతుల మెరుగుదలకు వెచ్చించనున్నామని వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ స్పష్టం చేశారు. ఆ దిశగా ఇప్పటికే చేయాల్సిన పనులకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.

07/27/2016 - 06:23

నక్కలగుట్ట, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలోని రైతు సమస్యలపై స్పందించని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యురాలు సీతక్క పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా రైతు సంఘం కార్యవర్గ సమావేశం రైతు సంఘం అధ్యక్షుడు చాడ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగింది.

07/27/2016 - 06:23

ముంబయి, జూలై 26: దేశీయ ఐటిరంగ దిగ్గజాలైన టిసిఎస్, ఇన్ఫోసిస్, ఔషధరంగ దిగ్గజాలైన సన్ ఫార్మా, లుపిన్, ప్రైవేట్‌రంగ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు.. ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ భారతీయ సూపర్ 50 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అయితే ప్రముఖ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్, ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ (హెచ్‌యుఎల్) ఈ ఏడాది జాబితాలో స్థానం పొందలేకపోయాయి.

07/27/2016 - 06:22

కాకినాడ, జూలై 26: సకాలంలో ఆదాయ పన్నును చెల్లిస్తే ఎటువంటి సమస్యలు ఎదురుకావని, విధిగా ఆదాయ పన్ను చెల్లించాలని విశాఖ ఆదాయ పన్ను కమిషనరేట్-2 ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వర్ చిదార సూచించారు. ఆదాయ పన్ను ఎగవేతదారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ ద్వారా ఆదాయ వెల్లడి పథకం-2016ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

07/27/2016 - 06:20

ఆదిలాబాద్,జూలై 26: వచ్చే దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు సాగిస్తుండగా నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ఆశలు సన్నగిల్లాయి. తొలుత మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల విభజన ఖాయమని, కొత్త జిల్లా పేరు కొమరంభీం జిల్లాగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలోనే మూడవ జిల్లాగా నిర్మల్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.

07/27/2016 - 06:20

ఆదిలాబాద్, జూలై 26: సాగునీటి ప్రాజెక్టుల రిడిజైనింగ్ పేరిట టీ ఆర్ ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతూ రైతుల భూములను బలవంతంగా లాక్కుంటూ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని, మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను మార్గమద్యంలో అరెస్ట్ చేయడం అమానుషమని డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ అన్నారు.

07/27/2016 - 06:19

కౌటాల, జూలై 26: మంచి వాతావరణం, చదువుకునేందుకు అనువైన సకల సౌకర్యాలు, నాణ్యతతో కూడిన భోజనం, ఉచితంగా లభించే పుస్తకాలు ఆపై అన్ని రకాలా సౌకర్యాలు... ఇదీ ప్రభుత్వ వసతి గృహాల నమూనా. ఈ పరిస్థితులన్నింటికీ విరుద్దంగా తయారైంది కౌటాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం.

Pages