S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 03:55

విజయనగరం, జూలై 24: ఉద్యానవన పంటలు పండించే రైతులకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. ఉద్యానవన పంటలు పండించే రైతులు పరస్పర సహాయ సంఘాలు ఏర్పాటు చేసుకుని లాభం పొందాలన్నారు.

07/25/2016 - 03:54

విజయనగరం (్ఫర్టు), జూలై 24: పట్టణంలో అంబటిసత్రం జంక్షన్ నుంచి కొత్తపేట నీళ్ల ట్యాంక్‌కు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణపనులు ఒక కొలిక్కి రాలేదు. రోడ్డు నిర్మాణంలో భవనాలను కోల్పోతున్న యజమానులకు భరోసా ఇవ్వడంలో మున్సిపల్ పాలకులు నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నారు. ఫలితంగా రోడ్డు నిర్మాణానికి భవనాలను కోల్పోతున్న యజమానులు అంగీకారపత్రాలను ఇవ్వడం లేదు. ఏడాదిన్నర కాలం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

07/25/2016 - 03:53

విజయనగరం(టౌన్), జూలై 24: జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల సాధించడంలో ప్రజలతో కలసి ఉద్యమించాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తీర్మానించారు. ఆదివారం కంటోనె్మంట్‌లోని గురజాడ పబ్లిక్ స్కూల్‌లో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల సాధనకోసం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.

07/25/2016 - 03:53

విజయనగరం(టౌన్), జూలై 24: అధికారంలోకి వస్తే పేదలకు పక్కా గృహాలు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఈ రెండేళ్లల్లో అమలుకు నోచుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మజ్జిశ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు.

07/25/2016 - 03:52

నెల్లిమర్ల, జూలై 24: నెల్లిమర్ల జూట్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్న హక్కులను కోల్పోవల్సిన పరిస్థితి నెలకొంది. కార్మిక చట్ట ప్రకారం ఉద్యోగ విరమణ పొందిన వారికి యాజమాన్యం గ్రాట్యూటీ, పిఎఫ్ చెల్లింపులు చేయాల్సి ఉన్నా గత ఆరు మాసాలుగా ఉద్యోగ విరమణ పొందిన 600 మంది కార్మికులకు యాజమాన్యం మొండిచేయి చూపింది.

07/25/2016 - 03:52

విజయనగరం (్ఫర్టు), జూలై 24: మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పువాటిల్లే జీవో-279ను తక్షణమే రద్దు చేయాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ జీవోను రద్దు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈనెల 28వ తేదీన మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.

07/25/2016 - 03:51

విజయనగరం (్ఫర్టు), జూలై 24: చదరంగం వల్ల విద్యార్థులలో మేథాశక్తి మెరుగుపడుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఆనందలక్ష్మి అన్నారు. జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి చదరంగం పోటీలను ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనందలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చదరంగం నేర్పించడం వల్ల ఆటలతోపాటు చదువులో కూడా రాణిస్తారని తెలిపారు.

07/25/2016 - 03:51

నెల్లిమర్ల, జూలై 24: ప్రతి ఒక్కరు మొక్కలునాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నెల్లిమర్ల నగర పంచాయితీ కమిషనర్ వి.అచ్చింనాయుడు కోరారు. ఆదివారం ఆయన నగర పంచాయితీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చని అన్నారు. అలాగే వాతావరణాన్ని సమతుల్యం సాధించవచ్చని చెప్పారు.

07/25/2016 - 03:50

విజయనగరం (్ఫర్టు), జూలై 24: పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు అని ఎలయన్స్‌క్లబ్ గవర్నర్ డాక్టర్ ఉప్పల వల్లి అన్నారు. పట్టణంలో వుడాకాలనీలో ఆదివారం జరిగిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వల్లి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.

07/25/2016 - 03:49

సింహాచలం, జూలై 24 : అడివివరంలోని మహాత్మా జ్యోతిరావుపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల రూపురేఖలు మూడు నెలల్లో మారనున్నాయని రాష్ట్ర విద్య, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన గురుకులంలో విలేఖరులతో మాట్లాడారు.

Pages