S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 05:14

నెల్లిమర్ల, జూలై 22: నేరాలను నియంత్రించడానికి పోలీసు శాఖ వినూత్న ప్రయోగాలు చేస్తోంది. నెల్లిమర్ల నగర పంచాయతీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సినిమా థియేటర్లు, వైన్ షాపులలో యజమానులే స్వచ్ఛంధంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. రామతీర్థం జంక్షన్‌లో మూడు, మొయిద జంక్షన్‌లో మూడు సిసి కెమెరాలు ప్రస్తుతం ఏర్పాటు చేశారు.

07/23/2016 - 05:13

గజపతినగరం, జూలై 22: మండలం లో రహదారులు బాగున్నా ఆర్టీసీ సేవ లు మాత్రం అన్నిగ్రామాలకు అందడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధు లు, అధికారులు పట్టించుకోవడం లే దు. మండలంలో 28 పంచాయతీలు, ఏ డు మధుర గ్రామాలు కలిపి 35 పం చాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల ను ంచి ప్రతిరోజు ఇంటర్, డిగ్రీ ఆపై ఉన్న త చదువులకు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు బస్సులు లేక సైకిళ్లపై విద్యార్థులు వస్తున్నారు.

07/23/2016 - 05:13

వేపాడ, జూలై 22: ప్రజా సంక్షేమం కోసం పటిష్టమైన విధానాలను అవలంభించేందుకు వీలుగా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సాధికార సర్వేపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు అపోహలు చెందాల్సిన పనిలేదని తహశీల్దార్ పద్మావతి స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన మండల సమావేశంలో బి.కె.ఆర్.పురం సర్పంచ్ ఎం.

07/23/2016 - 05:12

గజపతినగరం, జూలై 22: ఇష్టారాజ్యంగా చెరువు గర్భాలను ఆక్రమించుకుని సాగుచేస్తున్న వాటిని స్వాధీనం చేసుకుని చెరువు కింద పట్టాదారులకు సాగునీరు ఇవ్వాలని ము చ్చెర్ల గ్రామ రైతులు తహశీల్దార్ మసీలామణిని కోరారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి రైతులు వ చ్చి వినతిపత్రాన్ని అందజేశారు.

07/23/2016 - 05:12

విజయనగరం (్ఫర్టు), జూలై 22: జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు భారీగా రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించామని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) రీజనల్‌మేనేజర్ జె.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 24వతేదీన రుణమేళా నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25వేల నుంచి 25 కోట్ల రూపాయల వరకు రుణాలను అందిస్తామని చెప్పారు.

07/23/2016 - 05:10

విజయనగరం (్ఫర్టు), జూలై 22: పట్టణంలో 55 లక్షల రూపాయలతో నగర వనం ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు. అటవీశాఖ అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణానికి సమీపంలో ఉన్న మత్స్యకొండను నగర వనంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

07/23/2016 - 05:10

విజయనగరం (్ఫర్టు), జూలై 22: పట్టణంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తే అభివృద్ధి పనులపై శే్వతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. అభివృద్ధి పనులకు తమవద్ద రికార్డులు ఉన్నాయని, వాటిని పరిశీలించవచ్చునని చెప్పారు.

07/23/2016 - 05:09

విజయనగరం(పూల్‌బాగ్), జూలై 22: హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆర్గనైజర్‌గా బి. హైమావతి నియమితులయ్యారు. ప్రస్తుతం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆర్గనైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.వి.సత్యనారాయణ ఈ నెలలో పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఈ బాధ్యతలను టిటిడి విజయనగరం కల్యాణమండపం బ్రాంచ్ మేనేజర్ హైమావతికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.

07/23/2016 - 05:07

జగదాంబ, జూలై 22: విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరగడం ముఖ్యం కాదు వారికి నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమని కలెక్టర్ యువరాజ్ అన్నారు. శుక్రవారం ఎయులోని అంబేద్కర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి హైస్కూళ్లు, మున్సిపల్ హెచ్‌ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేస్తూ బాధ్యతతో పనిచేయాలన్నారు.

07/23/2016 - 05:06

జగదాంబ, జూలై 22: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జపాన్ భాష, సంస్కృతిని మరింతగా ప్రోత్సహిస్తామని ఎయు విసి ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో మాట్లాడుతూ మిత్సుబిషి కార్పొరేషన్ సంస్థ ఎయులో జపాన్ భాష అధ్యయన కేంద్రం అభివృద్ధికి రూ.15 లక్షల నిధులను మంజూరు చేసిందన్నారు. ఎయులో జపాన్ అధ్యయన కేంద్రం విస్తృతికి అందిస్తున్న సహకారం అభిలషణీయమన్నారు.

Pages