S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత విద్యా సంస్థలదే...

అవనిగడ్డ, జూలై 22: కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత విద్యా సంస్థలు, విద్యార్థులపై ఉందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గంలోని విద్యా సంస్థల యాజమాన్యాలు, మండల విద్యా శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా సాగర సంగమంలో పది వేల మంది విద్యార్థులతో కోలాట ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే పుష్కరాలు ప్రారంభ రోజున స్థానిక శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయం నుండి కొత్తపేటలోని కృష్ణా పుష్కర ఘాట్ వరకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు ప్రదర్శనగా చేరుకుని పుష్కరుడికి స్వాగతం పలుకుతారని తెలిపారు. ఎప్పటికప్పుడు మండలాల వారీగా ప్రధానోపాధ్యాయులు, ఎంఇఓలు సమావేశమై ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5గంటల నుండి రాత్రి 8గంటల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం ఇతర ప్రాంతాల నుండి వచ్చే కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు. అధ్యాత్మిక ఉపన్యాసాలు కూడా ఉంటాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి ఎ సుబ్బారెడ్డి, జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, ప్రగతి విద్యా సంస్థల అధినేత సనకా పూర్ణచంద్రరావు, విద్యానికేతన్ అధినేత లంకమ్మ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నియోజకవర్గంలోని మోదుమూడి, టి.కొత్తపాలెం, కోసూరువారిపాలెం గ్రామాలకు చెందిన నలుగురికి వైద్య ఖర్చుల నిమిత్తం సిఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.1.67లక్షలు చెక్కులను పంపిణీ చేశారు.