S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 05:38

ఆకివీడు, జూలై 22: వింత వ్యాధితో బాధపడుతున్న ఆకివీడు మండలం చినకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. గత పది రోజులుగా పాఠశాలకు వచ్చిన విద్యార్ధిని విద్యార్ధులు వింత వ్యాధికి గురై కళ్లు తిరిగి పడిపోతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి సోమవారం వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించారు.

07/23/2016 - 05:38

విజయవాడ, జూలై 22: పార్టీ శ్రేణులకు సిఎం చంద్రబాబు కొత్త అసైన్‌మెంట్ ఇచ్చారు. పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాల గురించి పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతున్నాయని చంద్రబాబు చాలా కాలంగా ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు రేటింగ్ ఇచ్చి, అట్టడుగు రేటింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో సహా 400 మంది పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధమవతున్నారు.

07/23/2016 - 05:37

కొత్తగూడెం, జూలై 22: సింగరేణిలో గుర్తింపు ఎన్నికల సందడి మొదలయింది. ఒకనాటి ప్రత్యర్థి సంఘాలు ఎఐటియుసి, ఐఎన్‌టియుసిలు ఈ ఎన్నికల్లో ఐక్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తవడంతో ఇప్పటి నుండి ప్రత్యర్థి సంఘాలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.

07/23/2016 - 05:18

విజయనగరం, జూలై 22: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 45 రోజులు కావస్తున్నా భారీ వర్షాల జాడ లేకపోవడంతో జిల్లా రైతులు దిగాలు పడుతున్నారు. జూన్‌లో కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు ప్రారంభించిన జిల్లా రైతాంగం తరువాత వర్షాలు కురియకపోవడంతో పంటలు వేసే పనులను పక్కకు పెట్టవల్సిన పరిస్థితి ఏర్పడింది.

07/23/2016 - 05:17

విజయనగరం, జూలై 22: చెన్నై నుంచి ఫోర్ట్‌బ్లెయిర్ వెళుతున్న ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం గల్లంతైన ఘటనతో విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని కుమురాం గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. విమానం గల్లంతు సంఘటనలో ఈ గ్రామానికి చెందిన బోడసింగి సాంబమూర్తి అనే వ్యక్తి ఆచూకీ లభించటం లేదు.

07/23/2016 - 05:16

విజయనగరం, జూలై 22: భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతి ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే జారీచేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు కురమాన జోగారావు అధ్యక్షతన ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై కార్యవర్గం చర్చించారు.

07/23/2016 - 05:16

విజయనగరం, జూలై 22: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఖాళీలకు ఉప ఎన్నికలు తక్షణం నిర్వహించాలని ఎపి పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఛాంబర్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ఖాళీలు ఏర్పడిన సందర్భంలో నాలుగు నెలలు మించకుండా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

07/23/2016 - 05:15

విజయనగరం(టౌన్), జూలై 22: స్కూల్, కాలేజీ, కాలేజి అటాచ్డ్ హాస్టల్ విద్యార్థుల మెస్‌ఛార్జీల పెంపు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సత్వర నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధిసంఘం జిల్లా కార్యదర్శి కె.సురేష్ డిమాండ్ చేశారు. శనివారం నుండి రాజధాని విజయవాడలో సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరాహార దీక్షల వాల్ పోస్టర్లను శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఎంఆర్ హాస్టల్‌లో ఆవిష్కరించారు.

07/23/2016 - 05:15

విజయనగరం(టౌన్), జూలై 22: వేలాది వాహనాల రాకపోకలు సాగించే 26వ నెంబర్ జాతీయ రహదారి ఎత్తు బ్రిడ్జిపై పెరుగుతున్న రద్దీని క్రమబద్ధీకరించేందుకు పట్టణ ట్రాఫిక్ విభాగం పోలీసులు చర్యలు చేపట్టారు. విశాఖపట్నం- రాయపూర్ జాతీయ రహదారిపై యాభై ఏళ్లకిందట ఎత్తు బ్రిడ్జిని నిర్మించారు. ఇటీవల ఈరహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.

07/23/2016 - 05:14

గజపతినగరం, జూలై 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్‌లో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు 160 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డిపూటీ జనరల్ మేనేజర్ కె. చంద్రరావు అన్నారు. స్థానిక సహకార బ్యాంకును శుక్రవారం డిజిఎం చంద్రరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇంతవరకు 85 కోట్ల రూపాయల మేరకు రుణాలు అందజేశామని తెలిపారు. నెలాఖరులోగా రూ.

Pages